ప్రపంచములోనే పువ్వులను* పూజించే సంస్కృతి, సాంప్ర దాయం తెలంగాణది . బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఇచ్చోడ సెప్టెంబర్ 25, (ప్రజా జ్యోతి)///... ప్రపంచంలో నే పువ్వులను ఆరాదీస్తూ గౌరవిస్తూ పూజించే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల్లో భాగంగా బతుకమ్మ చీరెలను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఆదివారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.