జయశంకర్ భూపాలపల్లి

గాంధీ మార్గం అనుసరణీయం ఎస్పి సురేందర్ రెడ్డి.

Submitted by srinivas on Mon, 03/10/2022 - 12:56

  భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్2(ప్రజాజ్యోతి)/... గాంధీ మార్గం అనుసరణియమని జిల్లా ఎస్పి శ్రీ జె. సురేందర్ రెడ్డి  అన్నారు. ఆదివారం  మహాత్మాగాంధీ  జయంతిని పురస్కరించుకుని  జిల్లా పోలీసు  కార్యాలయములో ఎస్పి అధ్వర్యంలో, పోలీసు  అధికారులు , సిబ్బంది గాంధీజీ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  బాపుజీ చిత్రపటానికి పూలమాల చేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన  మాట్లాడుతూ గాంధీ అహింస  మార్గమే ప్రజలకు దిక్సూచి అని, యువత గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, గాంధీ ఆశయాలు ఆచరణీయం అన్నారు.

గాంధీజీ మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శం. కలెక్టర్ భవేశ్ మిశ్రా

Submitted by srinivas on Mon, 03/10/2022 - 12:44

భూపాలపల్లి ప్రతినిది,అక్టోబర్ 2(ప్రజాజ్యోతి)./...మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.   జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం చెల్పూరు బస్టాండ్ లో గల గాంధీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి.ఎస్.

పోడు భూముల పై సర్వే పారదర్శకంగా నిర్వహించాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా

Submitted by srinivas on Fri, 30/09/2022 - 14:45

వివాదాలకు తావివ్వకుండా భూ సర్వే నిర్వహణ
172 ఆవాసాల నుండి వచ్చిన 25వేల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
పోడు భూముల సర్వే పై  కలెక్టర్ సమీక్ష

ఘనంగా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జయంతి వేడుకలు.

Submitted by srinivas on Wed, 28/09/2022 - 12:41

 భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుదు,  తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళ వారం నాడు ఘనంగా నిర్వహించారు.కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి జేసి స్వర్ణలత పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు తరాల పోరాటాలకు ఆయన ఆదర్శు డని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని శైలజ, డి.పి.ఆర్.ఓ. వి. శ్రీధర్, ఏఓ మహేశ్ బాబు , బి.సి.సంఘ నాయకులు బి.సత్యనారాయణ , అధికారులు,  సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జయంతి వేడుకలు.

Submitted by srinivas on Tue, 27/09/2022 - 14:45

భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుదు,  తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళ వారం నాడు ఘనంగా నిర్వహించారు.కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి జేసి స్వర్ణలత పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు తరాల పోరాటాలకు ఆయన ఆదర్శు డని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని శైలజ, డి.పి.ఆర్.ఓ. వి. శ్రీధర్, ఏఓ మహేశ్ బాబు , బి.సి.సంఘ నాయకులు బి.సత్యనారాయణ , అధికారులు,  సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల గౌరవం పెంచే విధంగా పనిచేయాలి. ఎస్పి సురేందర్ రెడ్డి.

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:11

భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్26  ప్రజాజ్యోతి.  ప్రజలకు ఉత్తమ పోలీసింగ్  అందించి పోలీసుల గౌరవం మరింత పెంచే విధంగాసిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సురేందర్ రెడ్డి  పేర్కొన్నారు.  సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ  ఆధ్వర్యంలో ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 19 మంది ఫిర్యాదారులు హాజరై సమస్యలను ఎస్పీ కి  తెలియజేసి, అర్జీలను ఇచ్చారు. ఈ సందర్బంగా బాధితుల  సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులు సమస్యలు  చట్ట పరిధిలో పరిష్కరిoచాలని   ఎస్పి  ఆదేశించారు.

అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరన

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:05

 భూపాలపల్లి, సెప్టెంబర్ -26ప్రజాజ్యోతి.  సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ముద్రించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆవిష్కరించారు.