Bazarhathnoor

ప్రభుత్వాలు మారిన మారని ఆదివాసీ (కొత్తపల్లి)కష్టాలు

Submitted by veerareddy on Mon, 26/09/2022 - 13:42

బజార్ హత్నూర్ సెప్టెంబర్ 25(ప్రజాజ్యోతి) .//..  బజార్ హాత్నూర్ మండలంలోని  మారుమూల గిరిజన గూడెం కొత్తపల్లి గ్రామ వాసులు కష్టాలు ఈ గ్రామానికి ఇప్పటివరకు రోడ్డు మర్గంలేదు ఎన్నో ప్రభుత్వాలు మారిన,పాలకులు మారిన, మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు   
వాపోతున్నారు గర్భిణీలు హాస్పిటల్ కి, పిల్లలు బడికి వెళ్ళాలన్న, వృద్ధులు పించన్ తిస్కోవడానికి, రేషన్ తిస్కోవడా నికి బజార్ హత్నూర్ కు వాగు దాటి వెళ్లాల్సిందే కావున మాకు వంతెన నిర్మించి రోడ్డు వేయాలని నాయకులు,అధికారులు,మమ్మల్ని పట్టించు కోవాలని గ్రామస్థులు కోరుచున్నాను.

విద్యా సామగ్రి పంపిణీ చేసిన యువజన ఫౌండేషన్ వారు

Submitted by Degala shankar on Mon, 26/09/2022 - 13:40

బజార్ హత్నూర్ సెప్టెంబర్25(ప్రజాజ్యోతి),.//, బజార్ హాత్నూర్ మండలంలోని గిరిజన మారుమూల ప్రాంతం అయిన డెడ్రా ప్రాథమిక పాఠశాలలో  యువజన ఫౌండేషన్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, తదితర విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షలు బుద్దర్తి నవీన్ గారి సూచనతో ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

బతుకమ్మ చీరలను పారదర్శకంగా పంపిణీ చేయాలి డిఆర్డిఎ డి పి ఎం గంగన్న

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:35

బజార్ హత్నూర్ సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి)..///..రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను పారదర్శకంగా, రేషన్ షాప్ ల వారిగా పంపిణీ చేయాలని డిఆర్డిఏ డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ బిట్ల గంగన్న, డిపిఎం హేమలత,  ఏపీఎం సీసీలను కోరారు. గురువారం బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం సీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూట్ ల వారీగా చీరలు పంపిణీ చేసే బాధ్యతను సీసీలు తీసుకోవాలని అన్నారు. చీరల పంపిణీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలని కోరారు.