Choutuppal

బిజెపిలో చేరిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Submitted by mallesh on Mon, 03/10/2022 - 11:34

చౌటుప్పల్ అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి): టిఆర్ఎస్  పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు.

మునుగోడు గడ్డమీద కాషాయపు జెండా ఎగురుతుంది బక్క స్వప్న శ్రీనాథ్

Submitted by mallesh on Wed, 28/09/2022 - 10:03

చౌటుప్పల్ సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి, రాజగోపాల్ రెడ్డి గెలుపుకై కృషి చేస్తానని చిన్న కొండూరు గ్రామ సర్పంచ్ బక్క స్వప్న శ్రీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చిన్న కొండూరు గ్రామంలో అహర్నిశలు పనిచేశానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పేదల కన్నీళ్లు తీర్చే పార్టీ పాల్వాయి స్రవంతి రెడ్డి

Submitted by mallesh on Wed, 28/09/2022 - 09:54

చౌటుప్పల్ సెప్టెంబర్ 27 ( ప్రజా జ్యోతి).//  మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే, ఒక్క ఓటు రెండు లక్షల రూపాయలకు తాకట్టుపెట్టి భారతీయ జనతా పార్టీకి అమ్ముడుపోయారని, మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు.

యుద్ధం చేసే సత్తా ఉన్న వారికి కత్తి చేతికి ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Submitted by mallesh on Tue, 27/09/2022 - 15:18

చౌటుప్పల్ సెప్టెంబర్ 26( ప్రజా జ్యోతి)//....మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసి ప్రతిపక్షం బిజెపి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు ఎక్కడినుండి తెచ్చి అభివృద్ధి ఎట్లా చేస్తారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం దేవలమ్మ నాగారం గ్రామంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు, మైనార్టీ, రెడ్డి, కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు.

ఉదయం బిజెపి పార్టీ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లోకి

Submitted by mallesh on Tue, 27/09/2022 - 15:03

చౌటుప్పల్ సెప్టెంబర్ 26( ప్రజా జ్యోతి) సోమవారం ఉదయం రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరిన స్వాములవారి లింగోటం  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాగని కేతమ్మ , సాయంత్రం మునుగోడు  కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి  సమక్షంలో తన సొంత గూటి అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేతమ్మ  మాట్లాడుతూ తనకు బలవంత పెట్టి  బిజెపి పార్టీ కండువా కప్పరని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను మరి ఇతర పార్టీలో కొనసాగలేనన్నారు.

బిజెపి పార్టీలో చేరిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు

Submitted by mallesh on Sun, 25/09/2022 - 11:40

చౌటుప్పల్ సెప్టెంబర్ 24( ప్రజా జ్యోతి) ..//. మునుగోడు ఉప ఎన్నికలో  బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పక విజయం సాధిస్తారని జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం దేవలమ్మ నగరలోని  టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన 30 మంది ముదిరాజ్ కుటుంబాలను చిలుకూరి ప్రభాకర్ రెడ్డి బిజెపి  పార్టీలోకి ఆహ్వానించారు.

ఆర్థిక సహాయం చేసి నా బిడ్డ ప్రాణం కాపాడండి

Submitted by mallesh on Sat, 24/09/2022 - 13:07

చౌటుప్పల్ సెప్టెంబర్ 23( ప్రజా జ్యోతి) ..///. మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన గుడ్డేటి జంగయ్య వయస్సు 24 సంవత్సరాలు వృత్తి లారీ డ్రైవర్, దేవరపల్లి, వెస్ట్ గోదావరి జిల్లా గురువారం తెల్లవారుజామున 3 గంటల  సమయంలో ముందస్తు జాగ్రత్తలు  పాటించకుండా రోడ్డుపైన నిలిపిన లారీని, జంగయ్య ప్రయాణిస్తున్న లారీ , వెనక నుండి ఢీకొనడంతో, తీవ్ర గాయాల పాలైన జంగయ్య కు రెండు కాళ్లు విరిగిపోయాయి, గాయాలపాలైన జంగయ్యను రాజమండ్రిలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరలించారు.

టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు ను బిజెపి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి

Submitted by mallesh on Sat, 24/09/2022 - 12:44

చౌటుప్పల్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి) ..///. బిజెపి పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎనగంటి తండ  గ్రామానికి చెందిన కరెంటోత్ కళమ్మ, కరెంటోత్ నీలు నాయక్, కరెంటోత్ చందు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 20 మంది కార్యకర్తలను జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రిక్కల సుధాకర్ రెడ్డి, శీర్క రంగారెడ్డి, ఎంపీటీసీ జ్యోతి జంగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత

Submitted by mallesh on Fri, 23/09/2022 - 10:22

చౌటుప్పల్ సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి) ..//./ అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న  నెలపట్ల గ్రామానికి చెందిన బండ్లపల్లి శంకరయ్య కు ఆర్థిక సహాయంగాను  మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి సహకారంతో 10000 రూపాయలను గ్రామ శాఖ అధ్యక్షుడు రాములు, శంకరయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.

బిఎస్సి పార్టీ అధికారంలోకి వస్తే భూమిలేని ప్రతి పేదవాడికి ఎకరం భూమి ఇస్తాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Submitted by mallesh on Fri, 23/09/2022 - 10:01

చౌటుప్పల్ సెప్టెంబర్ 22( ప్రజా జ్యోతి) ..//., నిధులు నియామకాలు కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, ప్రభుత్వ పాఠశాలను పాడు పడ్డ గృహాలుగా మారాయని బిఎస్సి పార్టీ రాష్ట్ర  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్ పేట్ గ్రామం నుండి రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మసిబట్టల కన్నా హీనంగా ఉన్న బతుకమ్మ చీరల మీద ఉన్న శ్రద్ధ , ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, మౌలిక వసతులు కల్పించడంలో లేదన్నారు.