అదిలాబాద్

జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పీసీసీ సభ్యులకు సన్మానం

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 15:00

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి)..//..  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ నివాసంలో శనివారం ఇటీవల టిపీసీసీ సభ్యులు గా నియామకం అయిన బోథ్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమూద్ ఖాన్, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడి పెళ్లి నగేష్ లను ఘణంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో టి పిసిసి సభ్యులను శాలువాలు కప్పి సన్మానించారు.

ఉమ్ర యాత్రకు వెళుతున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ కు సన్మానం

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:58

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి)..//.. శాంతి సామరస్యతను కాంక్షించి పవిత్ర ఉమ్రా యాత్ర మక్కా సందర్శన కు కుటుంబ సమేతంగా బయలుదేరుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు సాజిద్ ఖాన్ ను ఆ పార్టీ నాయకులు గణంగా సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాజిద్ ఖాన్ నివాసంలో శనివారం సాజిద్ ఖాన్ ను శాలువాలతో సన్మానించి పూలమాలలు తో సత్కరించారు.

కేసీఆర్ పాలనలో దగాపడ్డ ఉద్యోగులు

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:56

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి)..//.. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి  గ్రామాలలో విఆర్ఎ వ్యవస్థ రాష్ట్రానికి సేవాలందిస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయి, స్వరాష్ట్రంలో నైనా బతుకులు బాగుపడతాయనుకుంటే కేసీఆర్ పాలనలో కేవలం మొండిచెయ్యి లభించిందని, తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు దగాపడ్డారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ అర్బన్, రురల్ మండలాల్లో  నిర్వహిస్తున్న విఆర్ఎ ల నిరవధిక నిరాహారదీక్ష లో ఆయన పాల్గొన్నారు.

విద్యాసంస్థలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:53

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 23, (ప్రజా జ్యోతి),,,//// సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాలు, తదితర విద్యాసంస్థలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, భోజనం వసతి సౌకర్యాలలో సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలని, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ, న్యాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం జిల్లా లో పోడు భూములు, దళిత బంధు, ఆసరా పింఛన్ లపై సమీక్షించనున్న  సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.

శిక్షణ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:51

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)..//..శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శనివారం స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో రెవెన్యూ, పంచాయతీ, అటవీశాఖ, అధికారులకు అంతర్గత శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని వృత్తిరీత్యా విధులు నిర్వహించాలని, ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అవగాహనతో పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

గోల్డెన్ లీఫ్ ఉన్నత ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:43

 లింగాపూర్ సెప్టెంబర్ 24( ప్రజా జ్యోతి  )..//..  మండల కేంద్రంలోని గోల్డెన్ లీఫ్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మను పేర్చి ఒక్కొక్క పువ్వు వేసి బతుకమ్మను చూసి     బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ  పాటలు పాడుతూ  సంబరాలు ఘనంగా  నిర్వహించారు.  ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్  రాజశేఖర్ మాట్లాడుతూ  మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  జాదవ్ ప్రశాంత్. సుభాష్. విద్యార్థులు  పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:01

సిరికొండ సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి) .య మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి సిరికొండ మండల కేంద్రంలో జరిగింది.

కెసిఆర్ దూర దృష్టితోనే ఆర్టీసీ లాభాల బాట ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 13:58

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)''//  /నిరంతర శ్రామికులు ఆర్టీసీ సిబ్బంది వారి ప్రోత్సాహంతోనే ఆర్టీసీని లాభాల బాటలో పయనిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దూర దృష్టితో చేసిన సంస్కరణల వల్ల ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఉన్న అభద్రతను తొలగించేలా అనేక సంస్కరణలు చేపట్టి సంస్థను లాభాల బాట పట్టిస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.

సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్

Submitted by Degala shankar on Sat, 24/09/2022 - 13:13

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 23, (ప్రజా జ్యోతి),,..///సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు వారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం చాందా గ్రామ సమీపంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన సరుకులను, కిచెన్ గదిలోకి వెళ్లి పరిశీలించారు. సరుకులు చంద్రవందరంగా పడేసి ఉండడం వల్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు, భోజన విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.