కాజిపేట్

టెక్స్ టైల్ పార్కును సందర్శించిన ఎమ్మెల్యే అరూరి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:27

కాజీపేట, అక్టోబర్03 (ప్రజాజ్యోతి)./...మడికొండ ఇండస్ట్రీయల్ కారిడార్ లోని టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి ఈవి నరసింహ రెడ్డి తో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడి పరిశ్రమలలో వస్త్రాల తయారు విధానాన్ని, నాణ్యతను ఎమ్మెల్యే అరూరి రమేష్  పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత రంగాన్ని, టెక్స్ టైల్ పరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్ల తెలిపారు.

శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న జంగా, జక్కుల

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:30

కాజీపేట, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./...ఆదివారం హాన్మకొండ జిల్లా, కాజీపేట పట్టణం, 62వ డివిజన్ రెహమత్ నగర్, విష్ణుపురిలో శ్రీదుర్గా మహిళా కమిటీ, పంచముఖ హనుమాన్ సేవాసమితి యూత్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా మాజీ డీసిబి చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ లు పాల్గొని అమ్మవారి మండపాలను దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతపురం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసారు.

మీడియా పాయింట్ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు సన్మానం

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:27

కాజీపేట టౌన్, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./...ఇటీవల కాజిపేట మీడియా పాయింట్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ రిపోర్టర్ బత్తిని రాజేందర్ గౌడ్ ను సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం హానుమకొండ జిల్లా అధ్యక్షులు జూలూరి రంజీత్ గౌడ్ అధ్యక్షత కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ లు హాజరైమాట్లాడుతూ రాజేందర్ గౌడ్ అనేక సంవత్సరాల నుండి ఈనాడు, సాక్షి పత్రికలో రిపోర్టర్ గా సేవలు అందిస్తున్నారని అన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రికి రైల్వే జాక్ నివాళులు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:21

కాజీపేట టౌన్‌, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./.. తెలంగాణ రైల్వే జాక్ అధ్వర్యంలో కాజీపేట ఈఎల్ఎస్ రైల్వే క్వార్టర్స్ కూడలి యందు ఉన్నటువంటి భారతదేశ ప్రధమ రైల్వే శాఖ మంత్రి, దేశ రెండవ మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి 118 వ, జయంతి సందర్భంగా శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

దేవి నవరాత్రులలో అన్నదానం

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:15

కాజీపేట, సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)./...శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులతో భాగంగా ఐదో రోజు శివశక్తి యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం శాకంబరి పూజ శాఖ దాత గాయత్రి స్వీట్స్ సమర్పించగా, మహా అన్నదాన నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో దేవీ ఉపాసకులు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, రాపాక శ్రీనివాస్ శర్మ, శివశక్తి యూత్ సభ్యులు మిట్టపల్లి రవీందర్, బెదరకోట రంజిత్ కుమార్, నాగవెల్లి శ్రీధర్, గణేష్ సింగ్, కొదిరిపాక రఘు, కొదిరిపాక అశోక్, రౌతు కమల్, భరత్, రాజ్, హరి, ఆనంద్, సంతోష్, మనీ, గిరి, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అమ్మ ఆశీస్సులు అందరికి ఉండాలి చీఫ్ విప్ వినయ్. భాస్కర్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 15:07

కాజిపేట్, సెప్టెంబర్29 (ప్రజాజ్యోతి)./...అమ్మ దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్  దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు భాగంగా నాలుగో రోజు సందర్భంగా గురువారం కాజీపేట లో నిత్య పూజలో వినయ్ భాస్కర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవీ ఉపాసకులు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, శివశక్తి యూత్ సభ్యులు మిట్టపల్లి రవీందర్, బెదరకోట రంజిత్ కుమార్, నాగవెల్లి శ్రీధర్, కొదిరిపాక రఘు, కొదిరిపాక అశోక్, భరత్, హరి, ప్రశాంత్, సంతోష్, కమల్,  కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.రాజయ్య

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:01

కాజీపేట, సెప్టెంబర్28 (ప్రజాజ్యోతి)..//.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని రాంపూర్ లో కార్పోరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆడపడుచులకు బతుకమ్మ కానుక అందిస్తున్న 1680 బతుకమ్మ చీరలను తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి,శఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని, ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని అన్నారు.

షాపింగ్ మాల్ సిబ్బంది కి ట్రాఫిక్ పై అవగాహన

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:12

కాజీపేట టౌన్, సెప్టెంబర్28 (ప్రజాజ్యోతి).//..  నగరంలో ని చెన్నై షాపింగ్ మాల్ సిబ్బంది కి బుధవారం కాజిపేట్ ట్రాఫిక్ పోలీసులు  ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కాజిపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే. రామకృష్ణ , ఎస్సైరాజేష్ , ట్రాఫిక్ సిబ్బంది, ఆధ్వర్యంలో ట్రాఫిక్ మీద నిర్వహించిన ఈ అవగాహనా సదస్సు లో  హెల్మెంట్, సెల్ ఫోన్ డ్రైవ్, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్, పెండింగ్ చల్లాన్స్, పై కౌన్సిలింగ్ నిర్వహించారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:05

కాజీపేట, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి)././... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరల పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 46, 64 డివిజన్లకు చెందిన మహిళలకు మంగళవారం మడికొండ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మన అందరికీ గర్వకారణమని అన్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:41

కాజీపేట, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)./... కడిపికొండ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయము లో 11వ శ్రీ శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం జరిగాయి. ఉదయం 10గం లకు గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, శ్రీ చక్రస్థాపన, అఖండ దీపారాధన, శ్రీ సూక్త షోడశోపచార పూజ, దీక్ష కంకణ ధారణ, హారతి తీర్థ ప్రసాద వితరణ జరిగింది. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.