మహబూబాబాద్

జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎడ్ల నరేష్ రెడ్డి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:25

మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): మహబూబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గూడూరు మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన ఎడ్ల నరేష్ రెడ్డి ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి నియమించినట్లు తెలిపారు. నరేష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నందుకు వారికి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినట్లు తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతి పత్రం

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:16

మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):  ఎన్నో రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్  కుమార్ ను కలిసి కలిసి వినతి పత్రం అందజేశారు.

దుర్గ మాత పూజ హోంమంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా, సీతామహాలక్ష్మీ

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:14

మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): నెల్లికుదుర్ మండలం వావిలాల గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గ మాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు  హోమం లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డాక్టర్ సీతామాలక్ష్మి మాట్లాడుతూ వావిలాల గ్రామ ప్రజలకు ముందస్తుగా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిజేశారు.

జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:08

కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్శశాంక్ 

గాంధీ కి నివాళులర్పించిన హెచ్ పి ఏపీ ఎస్పి శరత్ చంద్ర పవర్

మాజీ జడ్పీటీసీ కుటుంబానికి మాజీ ఎంపీ పోరిక బలరాం పరామర్శ

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:21

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల మర్రిగూడెం గ్రామ పంచాయతి,తిర్ల పురం పాత తండా కు చెందిన గార్ల మాజీ జడ్పీటీసీ మాలోత్ తేజ్యా నాయక్  ఇటీవలే మృతిచెందగా మాజీ కేంద్రమంత్రి   పోరిక బలరాం నాయక్  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.ఇదే తండాకు చెందిన భూక్య జాముకు ఇటీవలె మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి,ఆర్ధిక సహాయం చేశారు.

సద్దుల బతుకమ్మ కు ప్రతి మహిళ అకౌంట్ లో వెయ్యి రూపాయలు జమ చేయాలి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:19
  • బతుకమ్మ చీరల పంపిణీ లో పెద్ద అవినీతి 
  • కోట్లల్లో దోచుకుంటున్నా   బకాసురులు
  • మహబూబాబాద్ వైస్ ఎంపిపి యెల్ది మల్లయ్యగౌడ్

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు చీరలకు బదులు వెయ్యి రూపాయలు వారివారి అకౌంట్లో జమ చేయాలని మహబూబాబాద్ వైస్ ఎంపిపి యెల్ది మల్లయ్యగౌడ్ అన్నారు.శుక్రవారం మండలంలోని అమనగల్ గ్రామంలో జరిగిన చూర్ల పంపిణి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్  పూజరి మంగమ్మ,జడ్పిటీసి సభ్యురాలు  లూనావత్ ప్రియాంకలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:32

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహబూబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం  ఇంటికన్నె గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.   గురువారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటన కోసం ప్రజా ప్రతినిధులు తెరాస కార్యకర్తలు ఇంటికన్నె గ్రామంలో పెద్ద ఎత్తున డప్పుల చప్పులతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘన స్వాగతం పలికారు.

భారీగా బిజెపి పార్టీలోకి చేరికలు

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 16:56

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  మహబూబాద్ జిల్లా నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మండల కేంద్రంలో  వీరారెడ్డి పెద్ద తండాకు చెందిన యువకులు బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు బిజెపి నాయకులు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో బిజెపి కండువా కప్పడం జరిగింది.

యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో నడవాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:44
  • ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగంలోకేష్
  • గార్ల లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో నడిచి చిన్నప్పటినుండి చెడు పై పోరాటం చేయాలనిఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ అన్నారు. గార్ల మండలం లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ 115 వ జయంతిని  ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.