ప్రజా జ్యోతి కధనంకు స్పందన బాధిత మహిళకు రూ 25 వేల చెక్కును పంపిణీ చేసిన తహసీల్దార్

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:01
Response to Praja Jyoti's article Tehsildar distributed a check of Rs 25 thousand to the victim woman

వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి) ..,ములుగు జిల్లా, వెంకటాపురం మండల పరిధిలోని బర్లగూడెం గ్రామ పంచాయతీ చిన్న గంగారం గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.ఆదివారం వేకువజామున ఇంట్లో నిద్రిస్తున్న మొడెం సమ్మక్క బయటకు పరుగులు తీసి ప్రాణాపాయం నుండి బయట పడింది.నిరుపేద ఐన సమ్మక్క తనకు న్యాయం చేయాలని బాధితురాలు  ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.అనే కధనం ప్రజా జ్యోతి దినపత్రిక లో ప్రచురితమైనది పాఠకులకు విధితమే.స్పందించిన తహశీల్దార్ ఆంటీ నాగరాజుక్షేత్ర స్థాయిలో సంభందిత సర్పంచ్ కోర్సా నరసింహ మూర్తి , కార్యదర్శి మౌనిక తో కలిసి పంచనామా నిర్వహించి  విచారణ చేపట్టారు.భారీ వర్షాలకు ఆదివారం తెల్లవారుజామున మోడెం సమ్మక్క నివాస గృహాం పెంకిటిల్లు పూర్తి స్థాయిలో కూలిపోయింది.భాధితురాలుకు ఆర్థిక సహాయం కోసం టిఆర్ఎఫ్ క్రింద ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కి నివేదిక పంపించామని తహశీల్దార్ తెలిపారు.

బాధితురాలి కి చెక్కు అందుచేత

తహశీల్దార్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి  ఏటూరు నాగారం పంపిన నివేదిక ద్వారా భాదితురాలు మోడెం సమ్మక్క కు టిఆర్ఎఫ్ గ్రాంట్ క్రింద 25,000 మంజురైనవి.అట్టి చెక్కును గురువారం బాధితురాలికి తహశీల్దార్ ఆంటీ నాగరాజు, సర్పంచ్ కొర్సా నరసింహ మూర్తి అందజేశారు.వారి వెంట డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావు, కార్యదర్శి మౌనిక ఉన్నారు.