సకల సిరులు సౌభాగ్యములు తో అందరు విరజిల్లాలని నడుము బిగించిన నారి మణులు విష్ణు శ్రీ తాటిపల్లి టవర్స్ లో బతుకమ్మ ఉత్సవాలు
కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 04, ప్రజాజ్యోతి:
సకల సిరులు సౌభాగ్యములు తో అందరు విరజిల్లాలని నడుము బిగించిన నారి మణులు గౌరమ్మను కొలుస్తూ కొత్తగూడెంలోని విష్ణు శ్రీ తాటిపల్లి టవర్స్ లో బతుకమ్మ ఉత్సవాలు అంత్యంత వైభవం గా నిర్వహించడం జరిగింది. కొత్తగూడెం నియోజక వర్గ వ్యాప్తంగా బతుకమ్మ అదే విధంగా నవరాత్రుల్లో బతుకమ్మను ఆరాధించి అనుగ్రహం పొందేందుకు ఆడపడుచులు, ఆనందోస్తాహాలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలు సుకుంటున్నారు. బతుకమ్మ పండుగలో ఎనిమిదవ రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మను నిలిపి కోలాట నృత్యా లతో ఆడిపాడి పూజిస్తున్నారు. మహిళలు, ఆడపిల్లలు ఎంతో సంబురంగా పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ అవనిని పులకింపజేస్తున్నారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజారంజకమైన పాటలు పాడుతు, అమ్మను పూజించుకుంటున్నారు.
- 35 views