చిట్యాలలో ప్రభుత్వ భూముల కబ్జా.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:44
Government land acquisition in Chitya.

 

  • -ఉన్నత అధికారులకు సమాచారం 
  • ఇవ్వని పంచాయతీ సెక్రటరీ
  • -ప్రభుత్వ ఆస్తుల ను కాపాడాల్సిన అధికారులు  డబ్బులకు అమ్ముడు పోయారా
  • -సర్పంచ్  భర్త అండదండలతో విరివిగా కబ్జాలు
  • -గ్రామ పంచాయితీ అనుమతి ఇచ్చింది అంటూ కబ్జాలు
  • -పట్టించుకోని రెవిన్యూ అధికారులు
  • -181 సేర్వే నెంబర్ లోని 49 ఎకరాల భూమి గోవింద
  • -దేవాలయాల పేరుతో,కుల సంఘాల పేరుతో కబ్జాలు

తాడ్వాయి:(ప్రజాజ్యోతి) .. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని చిట్యాల గ్రామములో ప్రభుత్వ భూములు గత కొంత కాలంగా కబ్జాలు జరుగుతూఉన్నప్పటికి స్థానిక పంచాయితీ సెక్రటరీ ఉన్నత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని గ్రామ  ప్రజలు వాపోతున్నారు. 181 సర్వ్ నెంబర్ లో 49 ఎకరాల భూమి ఉన్నట్టు ధరణి లెక్కలు చెపుతున్న ప్రస్తుతం మాత్రం 49 ఎకరాల భూమి మాత్రం కనపడటం లేదని, రెవిన్యూ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని ప్రజలువాపోతున్నారు..

-అంతా తానై

సర్పంచ్ భర్త అంత తానై వ్యవహరిస్తున్నడని తనకు నచ్చిన వారికి భూమిని కేటాయిస్తూ ,ప్రశ్నించిన వారిని బెదిరిస్తూఉన్నారని  గ్రామస్థులు అంటున్నారుప్రభుత్వ భూములపై అధికారము గ్రామ పంచాయతీ లేకున్నా ,తమకు ఉన్నదని చెప్తూ అమాయక ప్రజల దగ్గర భూమి ఇస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నప్పటికీ పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ పాలక వర్గానికే వత్తాసు పలుకుతూ ,వంత పడుతున్నారని..కంచె చేను మేసినట్టు కాపాలదారుగా ఉండాల్సిన పంచాయితీ సెక్రటరీ కబ్జాలు జరుగుతున్న ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

.-ఆయనకు ముట్ట చెప్పాల్సిందే

గ్రామములో నూతన గృహ నిర్మాణానికి, కొత్త పెన్షన్ కి అనుమతి కావాలంటే సర్పంచి భర్త కి డబ్బులు ముట్ట చెప్పాల్సిందే అనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఇవన్నీ చూస్తున్న పాలకవర్గం నోరు విప్పరని,పంచాయతీ సెక్రటరి పట్టించుకోవడం లేదని,రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు అని చిట్యాల గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రభుత్వ భూముల కబ్జాలని అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.