పామాయిల్ తోటల పెంపకం తోనే రైతుల ఆర్థిక ప్రగతి. ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:45
The economic progress of farmers is due to the cultivation of palm oil plantations.  MLA Muthireddy Yadagiri Reddy

జనగామ సెప్టెంబర్ 21, ప్రజాజ్యోతి :-స్థిర ఆదాయాన్నిచ్చే పామాయిల్ తోటల పెంపకం చేపట్టి రైతులు బలోపేతం కావాలని జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డులో ఉన్న ఆయిల్ పేడ్ పామ్ ఆయిల్ నర్సరీలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు జనగామ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి లతో కలిసి పామాయిల్ మొక్కలను పంపిణీ చేశారు.అనంతరం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని లత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రసంగిస్తూ దేశం యావత్తు ఆయిల్ కొరత ఎదుర్కొంటుందని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవటం శోచనీయమన్నారు.భారతదేశంలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు వనరులు అనుకూలంగా ఉన్న సరైన ప్రోత్సాహం అవగాహన లేకపోవడంతో రైతాంగం వివిధ రకాలపంటలు చేపట్టి దిగుబడి రాక మార్కెటులో ధర లేక నష్టపోతున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రం రైతన్న ఆదుకోవాలని దృఢ సంకల్పంతో  పామాయిల్ తోట లసాగును విస్తరింప చేస్తున్నట్లు తెలియజేశారు.ఆయిల్ ఫామ్ పంట సాగులో రైతులకు రవాణా ఖర్చులు ఉండవని కోతులు దొంగల బెడద ఉండదన్నారు.మొక్కలు పెట్టిన దగ్గర నుండి పంట కాపు వరకు మూడు సంవత్సరంల వరకు 27,000 ఎకరానికి సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలియజేశారు సబ్సిడీపై బిందు సేద్యం పరికరాల అందిస్తూ మార్కెట్కు  హామీ ఇవ్వడం జరుగుతుందన్నారు.నాలుగో సంవత్సరం నుండి ఎకరాకు 5 లేక ఆరు టన్నుల  పామాయిల్ గెలలు వస్తాయని టన్నుకు పదివేల నుండి 15 వేలు ఆదాయం వస్తుందన్నారు. జిల్లాలోని రైతు వేదికల ద్వారా పామాయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారుమోసవిధానంతోరైతులుపంటలుపండిస్తూనష్టాలుచవిచూస్తున్నారనిరైతునురాజునుచేసేందుకుపుష్కలంగానీరుతోపాటువిద్యుత్తునుకూడాఅందజేస్తామన్నారుతరిగొప్పుల లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ...
పంటలు పండించడంలో రైతులు ఎదుర్కొనే బాధలు వర్ణనాతీతమన్నారు. ఉదాహరణగా మామిడి తోట పెంపకం లో గాలి దుమారాలకు పూత రాలిపోవడం మార్కెట్లో ధర పలకకపోవటం తద్వారా రైతులు నష్టపోవడం చూస్తున్నామన్నారు కోతులు బెడద దొంగల బెడద వంటివి కూడా సమస్యలు తెచ్చిపెడుతున్నాయని పామాయిల్ తోటల సాగులో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు రైతాంగం పామాయిల్ సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం తప్పక ఉంటుందన్నారు.జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు జనగామ జిల్లా త్రాగునీరుకే కొరత ఏర్పడిన జిల్లాగా పేరుందని నేడు గెలవనరులలో పుష్కలంగా ఉన్న జిల్లాగా నాలుగో స్థానాన్ని సాధించినట్లు తెలియజేశారు పామాయిల్ తోటల విస్తరణ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్తామని రైతులకు అవగాహన పరుస్తామన్నారు.రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 1987లో పామాయిల్ సాగు ప్రారంభమైందని 25 జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతినిచ్చినట్టు తెలియజేశారు. రైతాంగం మూస పద్ధతిలోనే వరి పత్తి పంటలే పండిస్తూ కూలీల కొరత కోతులు అడవి పందులు దాడులు ఎదుర్కొంటూ నష్టపోతుందన్నారు.

రైతులందరూ ఆయిల్ ఫామ్ తోటల సాగు చేపట్టి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.
భద్రాచలం ఐటిసి మేనేజర్ సదానంద మాట్లాడుతూ పామాయిల్ తోటల బౌండరీగా రక్షణతో పాటు ఆదాయాన్నిచ్చే సర్వి మొక్కలను రైతులకు ఉచితంగా సరఫరా చేస్తామని తమ ఏరియా మేనేజర్ అనిల్ కుమార్ ను సంప్రదించాలన్నారు.అనంతరం పామాయిల్ తోటల సాగులో చాగళ్ళకు చెందిన ఆకుల రవీందర్ కొనకండ్లకు చెందిన రామేశ్వర్ దేవరప్పుల మండలం రామరాజు పల్లి గ్రామానికి చెందిన రంగారావు నర్మెటకు చెందిన మల్లారెడ్డి రైతుల సమస్యలను పరిష్కరించారు అనుమానాలను నివృత్తి పరిచారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకులు వెంకటరామిరెడ్డి మున్సిపల్ చైర్మన్ పోకల జమున మార్కెట్ చైర్మన్ విజయ సిద్ధలింగం రైతుబంధు అధ్యక్షులు రమణారెడ్డి, డి ఆర్ డి ఏ పిడి రాంరెడ్డి వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ ఆయిల్ఫడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి  ఎంపీపీ కళింగరాజు సర్పంచి సుజాత జడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు .