ఉచిత విద్య వైద్యం నిరుపేదలకు అందించడమే డాక్టర్ కేఏ పాల్ సంకల్పం

Submitted by mallesh on Fri, 16/09/2022 - 10:24
Dr. KA Paul's ambition is to provide free education and healthcare to the poor

ప్రజా గాయకుడు గద్దర్

చౌటుప్పల్ సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి .గ్లోబల్ పీస్ అండ్రీచ్  మిలియమ్స్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న హైదరాబాదు నుండి జింఖానా గ్రౌండ్లో నిర్వహించే  గ్లోబల్ పీస్ ర్యాలీని జయప్రదం చేయాలని సంస్థ హోస్ట్ కమిటీ సభ్యుడు ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. గురువారం చౌటుప్పల్ పురపాలక పరిధిలోని ఎన్ హెచ్ 9 హోటల్లో నిర్వహించినపాత్రికేయుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్లోబల్ పీస్ అండ్రీచ్  మిలియమ్స్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కే ఏ పాల్ సెప్టెంబర్ 25వ తేదీన జన్మదినం సందర్భంగా మునుగోడు కేంద్రంలోని శ్రీరామ్ హోమ్స్ లో డాక్టర్ కె ఏ పాల్ 59వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 25 వ తేదీ లోపు మునుగోడు నియోజకవర్గం లో నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే దృక్పథంతో వైద్యశాల నిర్మించడానికి కావలసిన భూమిని కొనుగోలు చేసి భూమి పూజ నిర్వహిస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజలందరికీ విద్యా, వైద్యం, ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను, పేద విద్యార్థుల కోసం ఎల్కేజీ నుండి పీజీ వరకు చదివే కళాశాలను నిర్మిస్తామని తెలియజేశారు.

ఇప్పటివరకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె ఏ పాల్ తన జన్మదిన వేడుకలు జరుపుకోలేదని పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో 59వ పుట్టినరోజువేడుకలుమునుగోడులోజరుపుకోవడమేకాకుండాపేదప్రజలకుఉచితంగావైద్యంఅందించడంకోసంనియోజకవర్గంలోవైద్యశాలనిర్మాణముకుభూమిపూజచేయాలనిగొప్పసంకల్పంతోతనపుట్టినరోజునుజరుపుకోవాలనుకుంటున్నారన్నారు. డాక్టర్ కే ఏ పాల్ భారత దేశంలో నిరుపేదలకు విద్యా వైద్యం అందించాలనే సంకల్పంతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఆచరణలోకి తీసుకుపోవడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి నరేందర్ పాల్గొన్నారు.