మేధావులకు పట్టని సామాన్యుని బాధలు..!!

Submitted by Praneeth Kumar on Thu, 11/01/2024 - 09:57
The common man's sufferings that intellectuals don't care about..!!

మేధావులకు పట్టని సామాన్యుని బాధలు..!!

ఖమ్మం, జనవరి 11, ప్రజాజ్యోతి.

పలానా ఊరిలో ఉచిత బస్సు ఉంది కదా అని ఒక ఆవిడ అలా బస్సులో తిరుగొద్దాం అని బస్సు ఎక్కింది, రూ 25/- మిగిలిచ్చ అని చాలా సంతోషంలో బస్సు ప్రయాణం మొత్తం 'మూడు రంగుల జెండ పట్టి..' అంటూ పాడుకుంటూ ప్రయాణం సాగించింది.
గమ్య స్థానం చేరాక, బస్టాండులో ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంది. ఒక నెల క్రితం చిప్స్ ప్యాకెట్ రూ 10/-, ఇపుడు అది రూ 12/- అయింది, సరేలే అని ఒక కూల్ డ్రింక్ కొనింది. ఒకప్పుడు అది రూ 20/- ఇపుడు రూ 25/- అన్నాడు సరేలే ఫ్రీ బస్సు కదా అని తీసుకుంది. రిటర్న్ బస్సు ఎక్కింది మళ్లీ రూ 25/- ఆదా చేసింది. తన స్టాప్ దగ్గర దిగి ఇంటికి వెళ్ళింది. ఈ ప్రయాణం అలసట వల్ల అన్నం వండుకొలే, దుకాణంకి వెళ్లి సరుకులు తెచ్చుకుంది. 'ఏంది మొన్న ఇవే సరుకులు నాకు రూ 120/- కే ఇచ్చావ్, ఇప్పుడు 160/- అన్నవెంది' అని కోపం తెచ్చుకుంది, రేట్లు పెరిగినాయి అన్నాడు. సరేలే అని ఇంటికి వచ్చి అన్నం వండుకుందాం అనుకుంది. గోడ మీద ఉన్న గాస్ సిలిండర్ పోస్టర్ చూసింది, గీ రూ 500/- గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారో అని అనుకుని వంట చేసుకుని అన్నం తినేసింది. ఇంతలో ఎవరో ఒంట్లో బాలేదు హాస్పిటల్లో ఉన్నారు అని ఫోన్ కాల్ వస్తే గబుక్కున లేచి బస్టాండ్ కి వెళ్ళింది. విరగబడిన జనం ఈ సమయంలో, సీట్ల కోసం కొట్లాటలు. ఒక గంట చూసాక ఈ ఫ్రీ బస్సుతో మనకి అవ్వదు అని అనుకొని ఆటో ఎక్కింది, హాస్పిటల్ దగ్గర దిగింది. ఆటో వాడు రూ 200/- అనేసరికి గుండె గుభేల్ అంది, ఒక నెల క్రితం రూ 40/- ఉండేది కదా అని అడిగితే 'మాకు ఫ్రీ బస్ వల్ల గిరాకి లేదు, మా భార్య బిడ్డల భవిష్యత్తు కోసం ఇక తప్పలేదు' అని అన్నాడు. ఇంక చేసేది లేక ఆ డబ్బులు ఇచ్చి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కలిసి మరల బస్టాండ్ దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పటికి బస్సులు లేక వందల్లో అక్కడే జనాలు ఏడుస్తూ, కొట్లాడుతు, తిట్టుకుంటూ, అరుచుకుంటూ అంత 'జాతర' లాగా ఉంది. ఆకలి వేసి ఏమన్నా తిందాం అనుకుంటే పెరిగిన రేట్లు గుర్తొచ్చింది. మూడు గంటలు గడిచినా తన బస్సు రాలేదు, జాతర తగ్గలేదు. తన బస్సు రాగానే నిండిపోయింది, ఎక్కడానికి కాదు కదా చూడటానికి కూడా సందు కనిపిస్తలేదు. అయ్యో రామ, అనుకుని ఇక చేసేది లేక ఆటో లో వెళ్ళింది. ఈ సారి రూ 250/- అన్నాడు, మళ్ళా అదే స్టోరీ చెప్పాడు, ఇంటికి చేరి హమ్మయ్య అని అనుకుంది. ఇంతలో అక్కడ ఎపుడో ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టి వెళ్ళారు. ఈ సారి రూ 200/- ఎక్కువ బిల్లు వచ్చింది, గోడ మీద '200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు మాఫీ' అని రాసిన పోస్టర్ ఉంటే చూసి నవ్వుకుంది. ఇంతలో వాళ్ళ నాన్న పొలం నుండి తిరిగి వచ్చాక ఇవన్నీ చెప్పుకుని బాధ పడింది. తనేమో నాకు ఇంకా రైతు బంధు పడలేదు అని చెప్పాడు. ఈ సారి మల్లేశం దగ్గర వడ్డీతో అప్పు తీసుకుని పంట వేద్దాం అని అనుకున్నారు, మల్లేశం మొన్ననే గెలిచిన మంత్రికి దగ్గర మనిషి. ఓటు కోసం అప్పుడు రూ 2000 ఇచ్చాడు. రాత్రి అయింది భోజనం చేద్దాం అని అనుకునే లోపు కరెంట్ పోయింది. వచ్చాక తిందాం అని ఆగారు 1, 2, 3 గంటలు అయింది ఇంక రాలే. కొవ్వొత్తులు పెట్టుకుని తినటం పూర్తి చేశారు. పడుకుంటూ 'ఈ సారి అర్థ రాత్రి పొలానికి కరెంట్ ఇస్తే వెళ్లాల్సి వస్తుంది' అని తన బిడ్డకు చెప్పి పడుకున్నాడు. ఆ అమ్మాయి ఆలోచనల్లో పడింది 'నాకు జాబ్ ఇయ్యలే అని, మా నాన్నని మార్పు కావాలని గోల పెట్టి కొత్త ప్రభుత్వానికి ఓటు వేయించా. ఇప్పుడు మా నాన్న వృత్తి మీద భారం పడుతుంది అనుకొలే. ఎదో ఒక పని చేసుకున్న కూడా నాన్నకి తోడుగా ఉండేదానిని. మళ్లీ ఇపుడు జీవితాలు కష్టంగా మారిపోయే, నాన్న నవ్వుతూ ఇంటికి రావడం చాలా రోజుల క్రితం చూసా. ఇలాంటి మార్పు చాలా బాధగా ఉంది అని అనుకుంటూ పడుకుండి పోయింది'. అర్థ రాత్రి నాన్న లేచి 'నేను పొలానికి వెళ్ళొస్తా నీళ్ళు పెట్టాలి' అని చెప్పి వెళ్తుంటే జాగర్త నాన్న 2010లో కూడా ఇలానే అమ్మ - నువ్వు వెళ్లి చివరికి నువ్వొక్కడివే తిరిగొచ్చావ్ అని అమ్మని గుర్తు చేసుకుని కళ్ళల్లో నీళ్ళు నింపుకుంది. 'మార్పుని కోరుకున్నాం కదా బిడ్డ' అని ఓదార్చి వెళ్ళాడు. ముందు ముందు మరి మన మేధావులు ఇంత కంటే మంచి మార్పును తేగలరో లేదో చూడాలి.