బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్
తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి); తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రత్యేక గౌరవమే బతుకమ్మ చీర అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో మహిళలకు ఇబ్బందులు కలుగకుండా పంపిణీ చేయాలని కార్యదర్శికి, గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు.