ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 11:29
Bathukamma is a festival to worship nature

పరమత సహనానికి ప్రతీక పూల పండుగ 

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

ప్రజా జ్యోతి  సూర్యాపేట జిల్లా ప్రతినిధి 23సెప్టెంబర్///;; ప్రకృతిని ఆరాధించే పండుగ  బతుకమ్మ  అని బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణ జాతికే సొంతమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని త్రివేణి ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరలను వివిధ వార్డు  మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూశాంతి సామరస్యానికి పరమత సహనానికి మహిళలు అందరు కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు చీరల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. టిఆర్ఎస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవ దక్కిందని పేర్కొన్నారు .కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు .2014 ముందు గతంలో పాలించిన పాలకులు ఏ మత సాంప్రదాయాలను సంస్కృతులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు మన సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువు టద్దమని అభివర్ణించారు. కల్యాణ లక్ష్మి ,షాది ముబారక్, 24 గంటల ఉచిత విద్యుత్ ,కేసిఆర్ కిట్ రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ  ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,  టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సవరాల సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్ ,మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ ,తెరాస కౌన్సిలర్లు ఇతర నాయకులు పాల్గొన్నారు.