ఫైటర్‌ తర్వాత రౌడీ ప్లానింగ్‌ ఎవరితో?

హైదరాబాద్ : రౌడీ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ ఫైటర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. లాక్‌ డౌన్‌ లో ఈ మూవీకి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ ఏడు నెల విరామ సమయంలో దేవరకొండ ఇంకేవైనా ప్రాజెక్టుకు కమిటయ్యారా? అతడి ప్లానింగ్‌ ఎలా సాగుతోంది? అంటే.. ఫిలింనగర్‌ గుసగుస ప్రకారం…పూరి చిత్రం తరువాత 2022 లో ఒక ప్రాజెక్ట్‌ కోసం శివ నిర్వాణ – సుకుమార్‌ తో చేతులు కలుపుతున్నాడని తెలిసింది. పెళ్లి చూపు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తో కలిసి అదే ఏడాది ద్వితీయార్థంలో ఓ సినిమా చేస్తాడు. అది ఓ రోమ్‌-కామ్‌ అని తెలిసింది. పెళ్లి చూపు కి సీక్వెల్‌ గా ఉంటుందా? అన్నది విజయ్‌ నే చెప్పాలి. మరోవైపు మహేష్‌ తో కలిసి దేవరకొండ ఓ మల్టీస్టారర్‌ చేస్తారని.. అలాగే ఘట్టమనేని బ్యానర్‌ లో ఓ సినిమా చేస్తారని కూడా ప్రచారమైంది. మరి దానికి సంబంధించి ఇటీవల ఎలాంటి అప్‌ డేట్‌ లేదు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *