సమంత అందుకే భయపడిందా..?

హైదరాబాద్ : పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్‌ కథకు ఎక్కువగా సమంత ఓకే చెబుతుంది. కమర్షియల్‌ పాత్రలు .. స్కిన్‌ షో పాత్రలకు సమంత పూర్తిగా దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాకు పూర్తి భిన్నమైన సినిమాను విభిన్నమైన కథను ఆమె ఎంపిక చేసుకుంటుంది. నటిగా మరింత పేరు దక్కించుకునే ఉద్దేశ్యంతో ఒక మూగ అమ్మాయి కథకు సమంత కొన్ని నెలల క్రితం ఓకే చెప్పింది. లాక్‌ డౌన్‌ లో ఆ కథపై దర్శకుడు అశ్విన్‌ శరవనన్‌ చాలా సార్లు ఆన్‌ లైన్‌ ద్వారా సమంత తో చర్చించడం జరిగింది. కథ నచ్చడంతో ఛాలెంజ్‌ ను యాక్సెప్ట్‌ చేసిన సమంత ఉన్నట్లుండి సడెన్‌ గా ఆ సినిమాను పక్కకు పెట్టేసింది.మూగ అమ్మాయి పాత్రలో సమంత ఎలా నటిస్తుందో చూడాలి అంటూ ఎదురు చూసిన వారికి నిరాశ కలిగించింది.

అనుష్క హీరోయిన్‌ గా నటించిన నిశబ్దం సినిమా నిరాశ పర్చింది. అనుష్క కెరీర్‌ వెనకబడి పోయేలా నిశబ్దం చేసింది. ఆ సినిమా ఫలితం చూసిన తర్వాత సమంత మూగ అమ్మాయి పాత్రలో నటించేందుకు వెనకాడుతుందట. సినీ కెరీర్‌ విషయంలో సమంత భయపడుతున్నట్లుగా కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఈ సమయంలో సినిమాల్లో నటిగా గుర్తింపు రావడంతో పాటు సక్సెస్‌ కూడా రావడం అంతే ముఖ్యం. అందుకే చూస్తూ చూస్తూ ఒక ప్లాప్‌ ఐడియాతో సినిమా చేయడం ఎందుకు అంటూ సమంత డ్రాప్‌ అయ్యిందని తెలుస్తోంది. సినిమా ఎలా ఉన్నా కూడా అనుష్క నిశబ్దం మాదిరిగానే సమంత మూవీ కూడా ఉందనే టాక్‌ వస్తుంది కనుక ఆ ప్రాజెక్ట్‌ ను వదిలేసి నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమాకు సమంత రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సమంత తదుపరి సినిమా విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *