పూజా సమయం లో వాడిన పూలు

సాక్షాత్తు శ్రీ కృష్ణుడు కూడా పూజా సమయం లో పూలను వాడాడు

హిందూ, ముస్లిం మరియు ఏ మత పద్దతిలో చుసిన ఆయా దేవుళ్ళకి పూజా సమయం లో పువ్వులను వాడటం అనేది ఆనాది కాలం నుండే ఓ ఆచారంలా వస్తుంది. కాని మనలో చాలా మందికి అసలు ఈ పూజా సమయంలో పువ్వులను ఎందుకు పెడతారు ? ఇలా దేవుడిని పువ్వులతో పూజించటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పటికి తెలిదు. అయితే మనసులో భక్తి ని నింపుకుని, స్వచ్చమైన మనసుతో దేవుడిని ప్రార్థించే సమయంలో ఎవరైతే పువ్వులను కాని, ఫలాలను కాని లేక స్వచ్చమైన జలాన్ని కాని దేవునికి సమర్పించుకుంటారో అట్టి భక్తితో కూడిన నైవేద్యాన్ని దేవుడు మనస్పూర్తిగా ఆరగిస్తాడని భగవద్గీత లో శ్రీ కృష్ణుడు తెలియపరిచాడు. అనగా ఏ మనిషి అయితే తమ దేవుణ్ణి స్వచ్చమైన మనసుతో కపటం లేకుండా ధ్యానం చేస్తూ పూజలు చేస్తారో, వారిని ఆ భగవంతుడు ఎల్లా వేళలా తమ వెనుకే ఉంటూ కాపాడుతాడు. సాక్షాత్తుగా ఆ శ్రీ కృష్ణ పారమత్ముడే తను చేసే పూజా సమయంలో పువ్వులను ఉపయోగించాదంటేనే మనం అర్థం చేసుకోవొచ్చు.

పూజా సమయం లో వాడిన పూలు
శివ లింగం యొక్క పూజా సమయం లో వాడిన పూలు

అలాంటి వారు పూజా సమయం లో పూలను తాకరాదు :

అసలు అలా పూజా సమయంలో పువ్వుల యొక్క పాత్ర అనేది ఎంత కీలకమైన అంశం అని. దానివల్లే పూజా సమయంలో దేవునికి పువ్వులు సమర్పించటం అనేది తప్పనిసరి ఆనవాయితి గా చలామణి అవుతూ వస్తుంది. ఇలా మనం పూజా చేసే సమయం లో దేవునికి అర్పించే పుష్పం ఏదైనా సరే అది ఖచ్చితంగా శుభ్రంగా ఉన్నదై ఉండాలి. అలాగే ఆ పుష్పాన్ని పనికి రాని స్త్రీలు, పురిటితో ఉన్నవారు, ఆశుభ్రంగా ఉన్నవారు తాకకుడదు అని మన పురాణం నుండి వేదాలు చెబుతున్నాయి. అదే విధంగా కింద పడిన పువ్వులు, సువాసనను చుసిన పువ్వులు, నీటితో శుభ్రపరిచిన పువ్వులు కూడా పూజా సమయంలో ఉపయోగించరాదు. ఉదయాన్నే శుభ్రంగా తల స్నానం చేసి, తడి బట్టలను ధరించి తాజాగా చెట్టు పై విరసిల్లిన పువ్వులను మాత్రమే కోసి వాటిని పూజా సమయంలో దేవునికి సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

Click Here to Read Our PrajaJyothi News Daily E-Paper

Share The News On
One thought on “పూజా సమయం లో పువ్వులను వాడటానికి కారణం ఏమిటి ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *