కన్నకొడుకును ఆ తల్లి ఎందుకు చంపించింది.. !!

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అవడం గ్రామానికి చెందిన బొమ్మని లక్ష్మి తన భర్త సింగరేణి ఉద్యోగం చేసి 2003లో చనిపోగా తన కొడుకును తీసుకుని నజీర్ పల్లి గ్రామంలో నివాసం ఉండేది. కొడుకు 2018లో నజీర్ పల్లి గ్రామానికి చెందిన ముష్క సమ్మయ్య కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కిషోర్ మద్యానికి బానిసై తను చేసే డ్రైవింగ్ పని కూడా సరిగా చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుంటూ తాగడానికి నిత్యం తల్లిని భూములు అమ్మి తనకు డబ్బులు ఇవ్వమని తల్లిని కొడుతూ ఉండేవాడు. తల్లి బొమ్మ లక్ష్మి మృతుడు తాగి వచ్చి డబ్బుల కోసం వేధించడం కొట్టడం భరించలేక కిషోర్ ను ఏ విధంగానైనా చంపేయాలని అనుకొని వారికి దూరపు బంధువైన సంతోషం రఘువరన్ r/o మంచిర్యాల తో కలిసి చంపాలి అని నిర్ణహించుకొన్నారు. రఘువరన్ అనునతడు కూడా కిషోర్ మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు సంబంధించిన బైకు దొంగ తనం లో డబ్బులు అడుగుతున్నాడు అని ఇద్దరు కలిసి కిషోర్ ని ఏవిధంగా చంపాలని అని నిర్ణయించుకుంది.

చంపడానికి మృతుని తల్లి వద్ద రఘువరన్ 50 వేల రూపాయలు బేరం కుదుర్చుకుని 10 వేల రూపాయలు ముందుగా తీసుకొని రఘువరన్ 15వ తేదీ కిషోర్ గ్రామంకు అవడం కి వెళ్లి అక్కడ కిషోర్ ని తన కారులో ఎక్కించుకుని మంచిర్యాల వచ్చి 16,17 తేదీల్లో మంచిర్యాల లో తిరిగి అతన్ని చంపడానికి అవకాశం రాకపోయేసరికి 18వ తేదీ తెల్లవారుజామున ఎలాగైనా చంపాలని భీమారం వైపు వెళ్లి భీమారం దగ్గర మాంతమ్మ టెంపుల్ ఏరియా కి తీసుకెళ్లి అక్కడ తన వెంట తెచ్చుకున్న కరెంటు సర్వీసు వైర్ తో కిషోర్ మెడకు ఉరి బిగించగా కిషోర్ అక్కడికక్కడే చనిపోగా అతని కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుని వచ్చి కారు డిక్కీలో వేసుకుని శవమును కిషోర్ తల్లి లక్ష్మి అలియాస్ లచ్చవ్వ కి చూపించి కిషోర్ అత్తమామల పై అనుమానం వచ్చే రీతిగా కిషోర్ శవాన్ని జైపూర్ మండలం నజీర్ పల్లి (ఇందారం) గ్రామ శివారులో ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన చెట్ల పొదల్లో పడేసి ఇంటికి వెళ్లినాడు.

తర్వాత రక్తం మరకలు గల తన టీ షర్టు కిషోర్ చెప్పులు తన ఇంటిలో బీరువా కింద దాచి పెట్టి తర్వాత కారు కడుగుతుండగా తన తల్లి పద్మ రాత్రంతా ఎటు పోయినావు ఎందుకు కారును కడుగుతున్నావు ఏమైంది అని అడుగగా తర్వాత రఘువరన్ వరుసకు మామ అయిన కిషోర్ ను చంపిన విషయం తన తల్లికి చెప్పగా తన తల్లి పద్మ ఇది చాలా పెద్ద నేరం అవుతుంది అని విషయం దాచిపెట్టి నేరంలో పాలుపంచుకుంది. శ్రీరాంపూర్ సిఐ గారు,ఎస్సై జైపూర్ గారు లు ఈరోజు 24.09.2020 న 0730 గంటలకు చాకచక్యంతో నేరస్తుడు రఘువరన్ ను రసూల్ పల్లి పైపుల కంపెనీ వద్ద పట్టుకోవడం జరిగింది. అతని వద్దనుండి 1.కారు 2 సెల్ ఫోన్లు 5000 వేల రూపాయలు డబ్బులు మరియు ఉరికి ఉపయోగించిన కరెంటు వైర్ స్వాధీనపరచుకొని తరువాత రెండో నేరస్తురాలు అయినా బొమ్మని లక్ష్మి వద్దనుండ సెల్ స్వాధీనపరచుకొని నేరం దాచిపెట్టిన పద్మను, రఘువరన్ను లక్ష్మిని ముగ్గుర్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హత్య కేసును అత్యంత త్వరగా చేధించిన శ్రీరాంపూర్ సిఐ బిల్లా కోటేశ్వర్, జైపూర్ ఎస్సై రామక్రిష్ణ, శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్, భీమారం ఎస్సై సంజీవ్ మరియు సిబ్బంది జి.బుచ్చిబాబు జి. శ్రీనివాస్ పీ. మల్లన్న, బి. సుబ్బారావు, బీ. రవి, కె. చంద్రమోహన్, డి.సురేష్, పీ.సురేష్, ఏ. రవీందర్, ఏ. పోచ నాయక్, సి.హెచ్. ఆనంద్ ఫుల్ ఎన్. సురేష్, సి.హెచ్. శ్రీనివాస్ జి. శ్రీనివాస్ లను జైపూర్ ఏసీపీ నరేందర్ అభినందించారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *