బాలకృష్ణ సరసన నాల్గవసారి ఆఫర్ ను ఎందుకు వదులుకుంది..

హైదరాబాద్ : ఈ మద్య కాలంలో బాలకృష్ణ నటిస్తున్న ప్రతి సినిమాకు కూడా హీరోయిన్‌ ఇష్యూ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్స్‌ ను ఎంపిక చేయడం దర్శకులకు చాలా పెద్ద టాస్క్‌ గా మారిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బోయపాటికి కూడా హీరోయిన్స్‌ విషయం చాలా పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం ఎంతో మంది ని హీరోయిన్స్‌ గా పరిశీలించారనే వార్తలు వచ్చాయి. కాని ఇంకా అధికారికంగా మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమా కోసం సోనాల్‌ చౌహాన్‌ ను సంప్రదించగా ఆమె కూడా నో చెప్పిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ కు జోడీగా సోనాల్‌ చౌహాన్‌ ఇప్పటి వరకు లెజెండ్‌.. డిక్టేటర్‌.. రూలర్‌ సినిమాల్లో నటించింది.

ఆ మూడు సినిమా వల్ల సోనాల్ ‌ కు కనీసం గుర్తింపు రాలేదు. అందుకే బాలయ్య సినిమాలో మళ్లీ అవకాశం వచ్చినా నటించేందుకు ఆసక్తిగా లేదనే వార్తలు వస్తున్నాయి. బోయపాటి సూచన మేరకు ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఒకరు ఆమెతో మాట్లాడారు అని ఆమె నో చెప్పిందని మీడియా సర్కిల్స్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆఫర్లే లేని సోనాల్‌ కు బాలయ్య ఆఫర్‌ చాలా పెద్ద విషయం. అలాంటిది ఎలా నో చెప్తుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆమెకు నిజంగానే ఆఫర్‌ వస్తే మాత్రం బోయపాటి కోసం అయినా నటించేందుకు ఓకే చెప్పాలి కదా అంటున్నారు. మూడు సార్లు బాలయ్య తో సోనాల్‌ నటించింది. నాల్గవ సారి నో ఎందుకు చెబుతుందని కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది సోనాల్‌ నోరు విప్పుతే కాని క్లారిటీ రాదు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *