తారక్‌ నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు ఈ అవార్డ్‌ రేంజ్‌ తారలు

హైదరాబాద్ : రమ్యకృష్ణ.. ఖుష్బూ.. ఈశ్వరీ రావు.. అర్చన.. ఒకరేమిటి వీళ్లందరి ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా? తెలిస్తే షాక్‌ తింటారు. వీళ్లంతా అవార్డు రేంజ్‌ స్టార్లు. ముక్త కంఠంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే తమకు ఎంతో ఇష్టం అనేసారు. అంతగా జూనియర్‌ లోనే ఏం చూశారు? అంటే .. రకరకాల ఆన్సర్స్‌ వస్తున్నాయి వీళ్ల నుంచి. తారక్‌ ప్రతిభ.. డ్యాన్సు.. ఎక్స్‌ ప్రెషన్స్‌.. వీటన్నిటినీ మించి వినయవిధేయత.. పెద్దలు అంటే గౌరవం ఇవన్నీ కూడా అతడంటే అభిమానించేలా చేస్తున్నాయి.

ఈ జనరేషన్‌ లో నెంబర్‌ వన్‌ హీరో తారక్‌ అని పొగిడేస్తున్నారంటే అతడిలో అంతగా ఆకట్టుకునే లక్షణాలు పొందిగ్గా ఉన్నాయి కాబట్టే. బెస్ట్‌ డ్యాన్సర్‌ గా.. నటుడిగా.. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా ఎన్టీఆర్‌ కి స్కై హై ఇమేజ్‌ ఉంది. వెటరన్స్‌ అంతా అంతగా అతడికి ఫిదా అయిపోతున్నారంటే ఆన్‌ లొకేషన్‌ వారికి అతడు ఇచ్చే గౌరవం కూడా అంతే ఇదిగా ఉంటుందట. జాబిల్లి కోసం ఆకాశమల్లే అంటూ పాడిన సీనియర్‌ నటి అర్చనకు తారక్‌ అంటే విపరీతమైన అభిమానం. రెండుసార్లు జాతీయ అవార్డ్‌ అందుకున్న ఈ నటి తారక్‌ తన ఫేవరెట్‌ హీరో అని అన్నారు.

జనతా గ్యారేజ్‌ లో మోహన్‌ లాల్‌ తో పోటీపడి నటించాడని ఎన్టీఆర్‌ కి కితాబిచ్చారు. యమదొంగలో తారక్‌ తో కలిసి నటించిన ఖుష్బూ కి తన ఫేవరెట్‌ జూనియరే. సీనియర్‌ నటి ఈశ్వరీ రావు ఎన్టీఆర్‌ అరవింద సమేత వీర రాఘవ లో నటించారు. తను ఉత్తమ నటుడు అంటూ పొగిడేశారు ఈశ్వరీరావు. కేవలం సీనియర్‌ నటీమణులే కాదు.. తారక్‌ తో నటించిన సీనియర్‌ క్యారెక్టర్‌ మేల్‌ స్టార్లు కూడా అతడిని గొప్ప హీరో అని పొగిడేస్తుంటారు. తనతో పని చేసిన దర్శకనిర్మాతలు కూడా తారక్‌ ని విపరీతంగా అభిమానిస్తుంటారు. దర్శకధీరుడు రాజమౌళి అయితే ప్రాణం పెట్టేస్తారన్న సంగతి తెలిసిందే.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *