గ్రేటర్‌ అభివృద్దికి కారుకే ఓటేయండి : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆరేండ్లలో హైదరాబాద్‌ ఎంతో పురోగతి సాధించిందని, దాన్ని కొనసాగించేందుకు త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో అభివృద్ది ఆగవద్దనుకుంటే టిఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా కవిత ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హైదరాబాద్‌ మహానగరంలో రోడ్లు, ఫ్లయ్` ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితు, 24 గంటల కరెంటు, శాంతిభద్రతలు .. ఇవన్నీ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కారణంగానే ఇంత గొప్పగా ఉన్నాయన్నారు. ఈ నాయకత్వాలన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్‌ ప్రజల పై ఉందన్నారు. నగరం వరుసగా ఐదేండ్లుగా ఇండియాలో బెస్ట్‌ సిటీగా ఉందని మర్సర్‌ వంటి ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ర్యాంకు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావని.. ఎంతో కష్టపడితే మాత్రమే సాధ్యమవుతాయన్నారు. ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *