కొత్తూరు జులై 08 ( ప్రజా జ్యోతి )

పట్టణ ప్రగతి హరితహారం లో భాగంగా ఎనిమిదవ రోజు ఏడో విడత హరితహారం లో భాగంగా కోత్తూరు మున్సిపల్ కేంద్రంలో దర్గా రోడ్లో మీసేవ దగ్గర మరియు పాత జాతీయ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆమె మాట్లాడుతూ.

పట్టణాలు, పల్లెలు, పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, ఏవో అశోక్, మున్సిపల్ మేనేజర్ మంజులత,

వైస్ చైర్మెన్ డోలి రవీందర్, ఎంపిటిసి రాజేందర్ గౌడ్, కౌన్సిలర్లు కోసిగి శీను, సోమ్లా నాయక్, కమ్మరి జయమ్మ జనార్ధన చారి, బ్యాగరి ప్రసన్న లత యాదయ్య, దాసరి నరసింహ, రవి నాయక్, ఆంజనేయులు గౌడ్, సిటీ కేబుల్ వెంకటేష్, బిజిలి రఘు, డ్రైవర్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *