రజనీకాంత్‌ పార్టీపై తొలగని అనిశ్చితి - నిరాశలో అభిమానులు

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ’మక్కళ్‌ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్‌ సోమవారం భేటీ అయ్యారు. దీంతో రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన ఉండొచ్చని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. కాగా.. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సమావేశం అనంతరం రజనీ ప్రకటించారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ జరిగింది. జిల్లా కార్యదర్శులతో కీలక అంశాల పై సుదీర్ఘంగా చర్చించిన రజనీ సమావేశం తర్వాత విూడియాతో మాట్లాడారు. ’మక్కళ్‌ మండ్రం కార్యదర్శులు , నిర్వాహకులు వారి తరఫు నుంచి లోటుపాట్లు నాకు తెలిపారు. నా అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నాను. రాజకీయ ప్రవేశంపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అని రజనీ వెల్లడించారు . కాగా.. రజనీకాంత్‌ జనవరిలో పార్టీని ప్రకటించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా కార్యదర్శుల అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారాం.

మరోవైపు రజనీ పార్టీని స్థాపించిన తర్వాత భాజపాతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని మక్కళ్‌ మండ్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. 2021 కల్లా తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన ఆంతరింగికులు పేర్కొన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని పేర్కొన్నారు. తన అభిమాన సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రజనీకాంత్‌ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జనవరిలో పార్టీ ప్రారంభిస్తే విూరు రెడీగా ఉన్నారా? కొన్ని జిల్లా అధ్యక్షుల పనితీరు ఏమాత్రం బాగోలేదు. విూరు కష్టపడితేనే మనం తరువాతి మెట్టు ఎక్కగలం . అని రజనీకాంత్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న విషయంలో మాత్రం సూపర్‌ స్టార్‌ ఓ నిర్ణయానికి ఇంకా రాలేదని సమాచారం. ఈ సమావేశంలోనే బీజేపీతో పొత్తు వద్దని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *