PrajaJyothi News

ఆత్మకూర్ (ప్రజాజ్యోతి) : మండలంలోని బిట్ల విద్యాసాగర్ భార్య 17రోజుల క్రితం మరణం. తల్లి మృతి చెందిన మూడవరోజే కొడుకు (కార్తీక్ ) తల్లి మృతిని తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మ హత్య ప్రయత్నం చేసాడు. దీంతో కొన ఊపిరితో ఉన్న ఆయనను ఎం.జి.ఎం. కి తరలించగా.. సరిగ్గా తల్లి జరిగిపోయిన 17 రోజులకే కొడుకు సోమవారం మరనించాడు. రోజు రోజుకు ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య భాదలతో, కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఆ కుటుంబంలో ఒక పిడుగు లాంటి వార్త ఆ కుటుంబాన్ని చాలా విషాదంలో ముంచెత్తింది. వృద్ధాప్యంలో వున్న ముసలి తల్లి తండ్రుల పోషణ, అనారోగ్యంతో వున్న ఇల్లాలి సమస్యలకు ఉన్న కాస్త భూమి అమ్మి నర్సంపేట లోని ఇసుక డంపింగ్ లో రోజు వారి కూలిగా పనిచేస్తూ కాలం వెళ్ళ తీస్తున్న తండ్రి కొడుకులకు ఆ ఇల్లాలి మృతి చాలా తీవ్రమైన మనోవేదనకు గురించేసింది.

గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటితడి పెట్టిస్తున్న విషాదము

ఇంతలో తల్లి మృతిని తట్టుకోలేని యువకుడు ఉరివేసుకొనిఆత్మ హత్య ప్రయత్నం చేసుకోవడం తో కొన ఊపిరి తో వున్న కొడుకును బ్రతికించుకొనే ప్రయత్నం లో ఆ తండ్రి, ఒక వైపు భార్య దిన కార్యక్రమాలు మరో వైపు, కొడుకు ప్రాణ ప్రాయం కోసం మార్గం. చివరకు కొడుకుని ఎం.జి.ఎం. కి తరలించగా 15రోజుల నుండి వైద్య సేవాలందించిన కాని ఫలితం లేకపోయింది. చివరికి ఈ రోజు ఆ చిన్నోడి ప్రాణం మృత్యువుతో పోరాడి అలసి పోయింది. ఈ మృతి ఆ కుటుంబాన్ని చాలా అగాధంలోకి నెట్టిపడేసింది. నా అనే వారు లేక దిక్కుతోచని విధంగా తయారైన ఆ కుటుంబ పరిస్థితి చాలా ఘోరంగా మారింది. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *