టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి పై స్థానికుల దాడి

హైదరాబాద్ ‌: హయత్‌నగర్‌ కార్పొరేటర్‌పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి పై స్థానికులు చేయి చేసుకున్నారు. రంగనాయకులగుట్టలో నాలా కబ్జాకు గురవుతుందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తిరుమలరెడ్డి పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుందంటూ కార్పొరేటర్‌ను కాలనీవాసులు నిలదీసి.. ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికులతో తిరుమల్ రెడ్డి మాట్లాడుతుండగా.. వెనక నుంచి వచ్చిన ఓ మహిళ ఆయన చొక్కా లాగేందుకు ప్రయత్నించింది. నాలా గురించి ప్రశ్నిస్తూ ఆయనను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. తక్షణం స్పందించిన స్థానికులు… ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. దీంతో అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *