tirumala-tirupati-darshan-closed-శ్రీవారి-దర్శనం

కరోనా వైరస్ కారణంతో ఇప్పటి వరకి చరిత్రలోనే అసలు ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఇప్పుడు తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని మూసి శ్రీవారి దర్శనం రద్దు చేసారు. అప్పుడప్పుడు గ్రహణం పడే వేళలలో తిరుమల తిరుపతి దేవస్థానం నందు శ్రీవారి ప్రధాన ఆలయం మూసిన కూడా, కాలి నడక మార్గమును మాత్రం మునుపెన్నడూ మూయలేదు.

Read More From PrajaJyothi News : పూజా సమయం లో పువ్వులను వాడటానికి కారణం ఏమిటి ?

కరోనా కారణంగా శ్రీవారి దర్శనం నిలిపివేత

ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ నేపధ్యంలో భారత దేశంలోని అసలు ఏ ఒక్క ప్రధాన ఆలయాన్ని కూడా దర్శించుకోడానికి భక్తులకి అనుమతి ఇవ్వటం లేదు. ఇలా భక్తుల యొక్క రాకను నిషేదించి ఆలయాల లోపల పూజలని పూజరిలా చేత ఏకాంతముగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో గల శ్రీవారి దర్శనం కూడా గత నెల మార్చ్ 22వ తేది నుండి నిలిపివేసి శ్రీవారి యొక్క భక్తులపై ప్రభుత్వం వారు ఆంక్షలు విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలా శ్రీవారి దర్శనం మొదటి వారం రోజుల వ్యవధి వరకి నిషేధాన్ని చేపట్టినట్టు తెలిపిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాన్ని ఈ నెల ఏప్రిల్ 14వ తేది వరకి పొడిగించారు. ఈ నేపధ్యంలో తిరుమల దేవస్థానం లో ఉగాది మరియు శ్రీ రామ నవమి వంటి పర్వ దీనాల వేడుకలను కూడా శ్రీవారి సన్నిధిలో పూజరిలా చేత ఏకాంతంగానే నిర్వాహణ చేయటం జరిగింది.

Read More From PrajaJyothi News : Today Gold Rate : తగ్గు ముఖం పడుతున్న బంగారం ధర

శ్రీవారి దర్శనం
శ్రీవారి దర్శనం రద్దు చేసిన T.T.D

Read More From PrajaJyothi News : తినడానికి తిండి లేకపోవటం వలనే ఆ కింగ్ కోబ్రా ని తిన్నాం!

ఏప్రిల్ 30వ తేది వరకి స్వామి వారి దర్శనం రద్దు

దేశంలోని కేంద్ర ప్రభుత్వం మరియు మన రాష్ట్రం లోని రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండూ కూడా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ని మరింత ముందుకు పొడిగించాలని చూస్తున్న వార్తలు రావటం తో తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి ఆలయంలో స్వామి వారి భక్తుల తాకిడిని ఈ నెల ఆఖరి వరకి నిలిపివేసి శ్రీవారి దర్శనం రద్దు చేయడానికి ఆలోచిస్తుంది. ప్రస్తుత పరిస్థితులని ఆధారంగా చేసుకొని ఏప్రిల్ 30వ తేది వరకి శ్రీవారి దర్శనం మరియు స్వామి వారి సేవలను రద్దు చేస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలను కేవలం పూజరిలు మాత్రమే ఏకాంతంగా జరుపనున్నారు. ఇది ఇలా ఉంటె తిరుమల లోని కనుమ దారులలో వాహనాల యొక్క రాకడిని పూర్తిగా రద్దు చేసారు. తిరుపతి క్షేత్రానికి ఇరు పక్కల ఉండే గ్రామాలలో నిరుపేదలు, రోజు వారి కూలీలు, వలుసగా వచ్చి చేరిన కార్మికులు, బిక్షగల్లు మొదలగు వారికి ప్రతి రోజు దాదాపు యాబై వేల మందికి పైగా సరిపడే విధంగా తిరుమల లోని అన్నదాన సత్రంలో భోజనం తాయారు చేసి, ఆ ఆహారాన్ని ప్యాకెట్ లలో పొందుపరిచి ఆకలితో అలమటిస్తున్న ఇలాంటి వారందరికీ పంచిపెడుతుంది.

Read More From PrajaJyothi News : PrajaJyothi News E-Paper

Share The News On
One thought on “తిరుమలలో రెండు వారాలు శ్రీవారి దర్శనం రద్దు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *