Praja Jyothi News

బల్మూర్ (అచ్చంపేట) (ప్రజాజ్యోతి న్యూస్) : మాజీ సైనికునికి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పరంగా వచ్చే భూమిని అతని పేరు చేసేందుకు 5లక్షల రూపాయలు డిమాండ్ చేసిన విషయం లో ముగ్గురు విఆర్వోలు రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పునుంతల మండలం ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బాలరాజుకు ప్రభుత్వ పరంగా వచ్చే ఐదెకరాల భూమిని బల్మూర్ మండలం లో ఎంచు కోవడం జరిగింది. ఈ విషయంలో తన పేర చేయాలని మాజీ సైనికుడు బాలరాజు బల్మూరు తహసిల్దార్ ని కోరగా 5లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధితుడు బాలరాజు తెలిపారు. ఈ క్రమంలో విఆర్వో లు బాల నారాయణ, చిన్నయ్య, బుచ్చి రాములు కలిసి తనను డీల్ చేశారని, ఈ సందర్భంలో 2 లక్ష రూపాయలు మొదటగా ఇస్తానని ఒప్పుకొని మంగళవారం బాల నారాయణ విఆర్ఓ సొంత గ్రామమైన లక్నవరం గ్రామంలో తన వ్యవసాయ పొలం వద్ద ఉండగా అక్కడ వెళ్లి డబ్బులు ఇచ్చే సందర్భంలో లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

తాసిల్దార్ ప్రమేయం పై ఆరా..!!

అంతకుముందు భూమి తన పేరున చేసే విషయంలో లంచం అడుగుతున్నారని సంబంధిత ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయలు లంచంగా తీసుకొని లెక్క పెడుతుండగా బాల నారాయణ, చిన్నయ్య, బుచ్చి రాములు ముగ్గురు కలిసి ఒకచోట ఉన్నారు. వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో మరొక టిం.ఏసీబీ అధికారులు సాయంత్రం ఐదు గంటల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో బూరి కాళ్లకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. రాత్రి 9 గంటల వరకు కూడా ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఏసీబీ అధికారులకు ముగ్గురు విఆర్వోలు పట్టుబడిన సమయంలో స్థానిక తాసిల్దార్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయనకు కొంతవరకు ఉపశమనం కలిగినదని భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఏసీబీ అధికారులు మూడు టీములుగా విడిపోయి తాసిల్దార్ కార్యాలయం, వీఆర్వో నారాయణ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ముగ్గురు విఆర్వోలు ఒకే సమయంలో లో ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో సంచలనం రేపింది. దీంతో అవినీతి అధికారులకు గుబులు పుట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *