కరోనాతో కలిసి వచ్చిన కాలం

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో ప్రచార సామగ్రికి గిరాకీ పెరిగింది. ప్రధానంగా మాస్కులకు కూడా గిరాకీ పెరిగింది. పార్టీ గుర్తుతో మాస్కు తయారు చేస్తున్నారు. కరోనా ఉన్నప్పటికీ సామాగ్రికి మాత్రం గిరాకీ తప్పడం లేదు. ఇంతకాలం ఖాళీగా ఉన్నవారికి ఇప్పుడు ఎన్నికల పుణ్యమా అని పని దొరికింది. ఎన్నికల సామగ్రి తయారీదాయరిదారులకు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సాధారణంగా రోజుకు300 ఇస్తుండగా ఇప్పుడు500 వరకు చెల్లిస్తున్నారు. కరోనా వల్ల ఖాళీగా ఉన్న తమకు గ్రేటర్ ఎన్నికలతో ఉపాధి దొరికిందని కార్మికులు అంటున్నారు.

కరోనా గైడ్ లైన్స్ ప్రకారం మాస్కులు ధరించడం తప్పనిసరైంది. దీంతో కార్యకర్తలతోపాటు ప్రచారంలో పాల్గొనే వేలాది మందికి మాస్క్ లు , ఫేస్ షీల్డ్ లు ఇచ్చేందుకు క్యాండేట్స్ వాటిని రెడీ చేయిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు , ఎమ్మెల్యేలు , కార్పొరేటర్ల ఫొటోతో పెద్ద ఎత్తున మాస్కులకు , ఫేస్ షీల్డ్ల కు ఆర్డర్లు ఇచ్చారు. ప్రభుత్వ శాఖలు , స్వచ్ఛంద సంస్థలు కూడా వీటి కోసం ఆర్డర్లు ఇచ్చాయి. గ్రేటర్ ఎన్నికలతో తయారీదారులు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికలు ఉండటంతో క్యాడేట్లకు ప్రచార సామగ్రిని అందించేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్ధులు ఖరారు కావడంతో ఆర్డర్లు భారీగా పెరిగాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర చిన్నపార్టీలు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వటంతో, ప్రచార సామగ్రిని అందించేందుకు తయారీదారులు ఎక్కువమంది కార్మికులతో పని చేయిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికలపై ముందే సమాచారం ఉండటంతో ప్రచార సామగ్రిని సమకూర్చుకోవడంలో టీఆర్ఎస్ దూసుకువెళుతోంది. ఇక అధికార పార్టీతో సమానంగా బీజేపీ కూడా పెద్దఎత్తున సామగ్రిని సమకూర్చుకుంటోంది. కాంగ్రెస్ సైతం ప్రచారానికి సై అంటూ ఎన్నికల సామగ్రి చేయిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు ఊహించి తయారీదారులు ముందే ప్రచార సామగ్రిని సిద్ధం చేశారు. పార్టీ గుర్తు, పార్టీ అధినేతతో బ్యానర్లు, టోపీలు , టీషర్టు, చిన్న, మధ్య, పెద్ద సైజు జెండాలు , ప్లకార్డులు , కీ చైన్లు , పెన్నులు , బ్యాడ్జీలు , ఇలా అన్నింటినీ రెడీ చేసి ఉంచుకున్నారు. టోపీలను తయారు చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కార్మికులు బిజీ అయ్యారు. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారంపై సోషల్ విూడియా ప్రభావం ఎక్కువగా ఉందని, దీంతో తమకు నష్టం జరుగుతోందని ప్రచార సామగ్రి తయారీదారులు వాపోతున్నారు. అభ్యర్థులు , వాళ్ల బంధువులు , అనుచరులు , కార్యకర్తలు పెద్దఎత్తున గ్రూప్ లు క్రియేట్ చేసి ఫేస్ బుక్, వాట్సప్ ఇతర సోషల్ విూడియా వేదిక ద్వారా ప్రచారం చేస్తున్నారని, ఆన్ లైన్ లోనే లైవ్ పెట్టే చాన్స్ లు ఉన్నందున తమకు ఆర్డర్లు తగ్గుతున్నాయని చెప్పారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *