ఆధునిక లైబ్రరీకి తగ్గ హంగులు పెరగాలి

సిరిసిల్ల : సిరిసిల్ల కు ఆధునిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు తోడు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. అన్నిరంగాల్లో ముందు నిలిచేలా లైబ్రరీని మరింత పటిష్టం చేయాల్సి ఉందని వారు అంటున్నారు. పోటీ పరక్షల కు లైబ్రరీలు పనికివచ్చేలా తయారు కావాలన్నారు. అయితే డిజిటల్‌ లైబ్రరీ మాత్రం ప్రారంభంతోనే మూతపడింది. జిల్లా కేంద్రానికే తలమానికంగా మారిన గ్రంథాలయం మరింత పటిష్టం కావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ రూ.5 లక్షల నిధులను కేటాయించడంతో కొంతమేరకు పుస్తకాల కొనుగోలు పక్రియ కొనసాగింది. తెలంగాణరాష్ట్రంలో తొలిసారిగా రూ3.60 కోట్లతో సినారే స్మారక జిల్లా కేంద్ర గ్రంథాయ భవనాన్ని నిర్మించారు. పూర్తిగా సెంట్రల్‌ ఏసీతో నిర్మించారు. పాఠకులకు సౌకర్యవంతంగా రీడిర్ ‌ గదులు , సమావేశ మందిరం, లిప్ట్‌ సౌకర్యం కల్పించారు. 60 కంప్యూటర్లతో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేశారు. పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చేతుల విూదుగా ప్రారంభించారు. అయితే ఇది పాఠకులకు అనుకున్న స్థాయిలో ఉపయోగపడడం లేదు.

పాతశాఖ గ్రంథాలయంలోని పుస్తకాలు మాత్రమే ఆధునిక గ్రంథాలయంలోకి మారాయి. గ్రంథాలయానికి కావలసిన సిబ్బందిని నియమించకపోవడంతో అలంకార ప్రాయంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. సిరిసిల్ల నడివొడ్డున వైట్‌హౌజ్‌ తరహాలో వెలిగిపోతున్న భవనంలోకి వెళితే మాత్రం పాఠకులకు నిరాశే కులుగుతుంది. జిల్లాలో నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండాల్సిన ఈ కేంద్రాలు చదువుకోవడానికి పుస్తకాలు లేక సరైన భవన, సౌకర్యాలు లేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలం గాణ రాష్ట్రంలోనే రూ.3.60 కోట్లతో అత్యంత భారీ భవనం హంగులతో సిరిసిల్ల జిల్లాకేంద్రంలో తొలిసారిగా మోడల్‌ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. సినారె స్మారక గ్రంథా;లయంగా నామకరణం చేశారు. సరైన పుస్తకాలు లేక అధ్వాన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా.. కేవలం పాత మండలాల్లోనే గ్రంథాలయ వ్యవస్థ కొనసాగుతోంది. వసతులు లేకపోయినా ఉన్న పుస్తకాలు , పేపర్లతో జిల్లాలో 3 లక్ష 36వేల మంది పాఠకులు గ్రంథాలయాలను ఉపయోగించుకుంటున్నారు. సిరిసిల్ల , చందుర్తి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నా నామమాత్రపు సౌకర్యాలే ఉన్నాయి.

మిగితా గ్రంథాయాలు అద్దె ఇళ్లలో చిన్న గదుల్లో కొనసాగుతున్నాయి. కొన్ని గ్రంథాలయాలకు ఇన్‌చార్జీు ఉంటే మరికొన్ని గ్రంథాలయాలకు అటెండర్లు, స్వీపర్లు, రికార్డు అసిస్టెంట్లు లైబ్రేరియన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేముల వాడ మున్సిపాలిటీ పరిధిలోనే 35 ఏళ్లుగా గ్రంథాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. గంభీరావుపేటలో చాలీచాలనీ గదిలో గ్రంథాలయం ఉండగా 2001లో అదనపు గదుల కోసం అప్పుడు ఎంపీగా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రూ. 50వేలు మంజూరుచేశారు. నిర్మాణం చేపట్టి నిధుల కొరతతో నిలిచిపోయింది. ఎల్లారెడ్డిపేటలో సొంత భవనం ఉన్నా ప్రహరీగోడ లేదు. లైబ్రేరియన్‌ లేకపోవడంతో కథలాపూర్‌ లైబ్రేరియన్‌ ఇన్‌చార్జీగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు బాటు వేయాల్సిన గ్రంథాయాల్లో ఇప్పుడు అసౌకర్యాలు వెంటాడుతున్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *