పోలీస్ స్టేషన్ ఎదుటే అనుమతి లేని ఆసుపత్రి..!

ఖమ్మం (వైరా) : ఖమ్మం జిల్లా వైరాలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లక్ష్మీ క్లినిక్ మొలలు ఆసుపత్రిని శుక్రవారం వైరా వైద్య ఆరోగ్య శాఖాధికారులు సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని వైరా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు సమాచారం రావడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ స్థానిక వైద్య అధికారులకు సమాచారం ఇవ్వగా డాక్టర్ శశిధర్ తన సిబ్బందితో లక్ష్మీ క్లినిక్ మొలలు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తను సొంతంగా వైద్యం చేస్తున్నారని నిర్ధారించారు. ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఎస్కె రాయ్ ని ప్రశ్నించగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఆసుపత్రి నిర్వహిస్తున్న ఎస్కే రాయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *