బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన

గూడూరు జూలై 10 ( ప్రజా జ్యోతి ): 

రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని గూడూరు మండల కేంద్రంలో  శనివారం  ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో  బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ 

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలుగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను  భర్తీ చేయాలనీ మరియు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్నం చేయడం  జరిగిందని అన్నారు. మొన్న సునీల్ నాయక్,  ఈ రోజు కొండల్ అనే నిరుద్యోగి ఇక నోటిఫికేషన్లు రావు అని ఆత్మస్థైర్యని కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం  జరిగిందని అన్నారు.

ఇవన్నీ కూడ ముమ్మటికి ప్రభుత్వ     హత్యలే అని ఆరోపించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నిధులు నియామకాలు అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస నియామకాల మాటకు సమాధానం చెప్పాలన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు

రోజురోజుకు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పల్లె ప్రగతి హరితహారం అని పేరు చెప్పుకుంటూ  మీడియా నో తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటినుండి బీజేవైఎం తరపున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అదే విధంగా నిరుద్యోగులందరికి బీజేవైఎం  అండగా ఉంటుందని వారికీ భరోసా కల్పించవల్సిందిగా కోరుతున్నాము  అని అన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేవైఎం మండల అధ్యక్షులు చెలుపురి రాజు . జిల్లా నాయకులు మెరుగు మల్లయ్య. మెరెడ్డి సురేందర్.  సమ్మెట సుధాకర్.

బత్తుల లక్ష్మణ్.చెలుపురి శ్రీశైలం.బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి బానోత్ భాస్కర్. బీజేవైఎం జిల్లా నాయకులు గుగులోత్ రాంబాబు నాయక్   బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి దేవి లాల్ నాయక్. టౌన్ అధ్యక్షులు కోరే అనిల్. మరియు  కోలా పైడి.చుంచ బాలయ్య  మరియు తదితర  పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *