మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దటమే లక్ష్యం : మంత్రి కొప్పుల

పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్ లో ఆదివారం 6లక్షల చేప పిల్లలను మంత్రి కొప్పుల ఈశ్వర్ వదిలారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టిందని అన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగిందన్నారు. గత ప్రభుత్వాలైతే మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలను కులవృత్తులను ఆధారపడి బ్రతికేవాళ్లను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందని తెలిపారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *