బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ 4 లక్షలు వసూలు

హైదరాబాద్‌ :  నగరంలోని జీడిమెట్ల పరిధి, అయోధ్యనగర్‌లో ఓ బాలికను బ్లాక్‌ మెయిల్‌ చేసిన ముగ్గురు వ్యక్తుల ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ముగ్గురు యువకులు.. ఆమె ఫొటోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫొటోను మార్ఫింగ్‌ చేస్తామని బాలికను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ విడతల  వారీగా రూ.4 లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల  14న ముగ్గురు యువకులు బాలిక ఇంటికి వచ్చారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వారిని ప్రశ్నించగా..  పదోతరగతి మెటీరియల్‌ కోసం వచ్చినట్లు ముగ్గురు యువకులు  వారికి తెలిపారు. అయితే వారిపై అనుమానం రావడంతో బాలికలను నిలదీయగా అసలు విషయం తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు ఎలిశా, కిశోర్‌, రాంవికాస్‌ గా గుర్తించారు. 

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *