దేశంలోనే మొట్టమొదటి టెలీ మెడిసిన్ సెంటర్ దోమకొండ లో ఏర్పాటు..

కామారెడ్డి : ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం దోమకొండ కోట వారసులు, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ కామినేని శోభన అనిల్ కుమార్ తో అపోలో ఫార్మసీ, మోడల్ టాయిలెట్, వైకుంఠ రథం లను ప్రారంభించారు. ఆనంద్ భవన్ ఆవరణలో ఫార్మసీ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. పాత తాలూక కేంద్రమైన దోమకొండ లో దేశంలోనే మొట్టమొదటి సారిగా టెలిమెడిసిన్ సెంటర్ ను ఏర్పాటు చేసినందుకు శోభన అనిల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల పైగా అపోలో ఫార్మసి ల ఏర్పాటు చేయడంపై అందులో దోమకొండ ఉండడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దోమకొండ మండల కేంద్రంలో మోడల్ టాయిలెట్స్ నిర్మించి తెలంగాణకి ఆదర్శంగా దోమకొండ వచ్చేలా చూసినందుకు కోటా వారసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోట వారసులు, అపోలో డైరెక్టర్ కామినేని శోభన అనిల్ కుమార్, కామారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, కామారెడ్డి డి వి ఎం గణపతి, డి ఎం ఆంజనేయులు, దోమకొండ ఎంపీపీ కోటా సదానంద, జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు ఐరేని నరసయ్య, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాజవాడ శ్రీకాంత్, దోమకొండ ఫోర్ట్ మేనేజర్ బాబ్జి, దోమకొండ పిఎసిఎస్ చైర్మన్ నాగరాజు రెడ్డి, మాజీ చైర్మన్ నర్సారెడ్డి, మాజీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ ఎంపిపి పుట్ట బాపు రెడ్డి, సర్పంచులు బాణాల సూర్యప్రకాశ్ రెడ్డి, సాయిలు, సలీం, సుమలత మురళి, స్వరూప సంజీవరెడ్డి, ఎంపిటిసిలు కడారి రమేష్, నిమ్మ శంకర్, కానుగంటి శారద నాగరాజ్, దోర్నాల లక్ష్మీ లక్ష్మణ్, ఫిరంగి రాజేశ్వర్,మాజీ ఎంపిటిసి లు నల్లపు శ్రీనివాస్, ముదాం గంగయ్య, తహసిల్దార్ అంజయ్య, ఎంపీడీవో చిన్నారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, సొసైటీ డైరెక్టర్లు శంకర్ రెడ్డి, రఘు, పంచాయతీ సభ్యులు బొమ్మెర శ్రీనివాస్, నేతల సుధాకర్ యాదవ్, జనార్ధన్ నాయకులు రాజిరెడ్డి, ఎస్ కె సైదు పాలకుర్తి శేఖర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *