సొంత అల్లుడినే సజీవ దహనం చేసిన అత్తింటివారు

జగిత్యాల : మూఢ విశ్వాసాలు, కుటుంబ కలహాలు అనుమానం నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ బలయ్యాడు. అత్తింటివారే పెట్రోల్‌ పోసి అతడిని నిప్పంటించి సజీవ దహనం చేశారు. జగిత్యాల జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ కిరాతక ఘటన కలకలం రేపింది హైదరాబాద్‌ అల్వాల్‌ ప్రాంతంలోని చేతన హౌజింగ్‌ కానీకి చెందిన రాచమ్ల వపన్‌కుమార్‌ బెంగళూర్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. 12 రోజు ల కింద పవన్‌ కుమార్‌ భార్య సోదరుడు జగన్‌ (38) గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 18న భార్యా పిల్లలను కొండగట్టుకు పంపాడు.సోమవారం జగన్‌ దశదిన కర్మ కావడంతో పవన్‌కుమార్‌ సైతం కొండగట్టులోని సహస్ర ముంజునాథ ఆయంలోని అత్తారింటికి వచ్చాడు. బావమరిది విజయ్‌ స్వామి, జగన్‌ భార్య సుమతను పరామర్శిం చాడు. అనంతరం జగన్‌ చిత్రపటం వద్ద నివాళుర్పిస్తుండగా.. అత్తింటివారంతా పవన్‌కుమార్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించి గదికి బయట నుంచి తాళం వేశారు. స్థానికులు పవన్‌కుమార్‌ కేకలు విని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గదికి తాళం వేయడంతో పవన్‌ కుమార్‌ పూర్తిగా కాలిపోయాడని సీఐ కిశోర్‌ తెలిపారు. ఎస్పీ సింధుశర్మతోపాటు జగిత్యా డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. జగన్‌ భార్య సుమతోపాటు మరొకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పవన్‌కుమార్‌ తల్లిదండ్రులు వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. త్వరలో కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *