నగరంలో పాలు నీళ్ల కోసం ఆక్రందన

హైదరాబాద్ : నగరంలోని అనేక కాలనీలు ఇంకా నీటిలోనే ముగిని ఉన్నాయి. ఎగువన చెరువుకు పడ్డ గండ్లతో నీటి వదర కొనసాగడంతో కాలనీలు నీటి నుంచి బయటపడలేదు. నీట మునిగిన ఇళ్లు.. బతుకమ్మను తలపించాయి. జడివాన.. అజడి సృష్టించింది. సహాయక చర్యల్లో భాగంగా జ దిగ్బంధంలోఉన్న ప్రజకు మంచినీరు, పాు తదితర వస్తువు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చాలాచోట్ల తమకు ఎలాంటి సాయం అందడం లేదు, ఎవరు కూడా పలకరించడం లేదని ఆరోపిస్తున్నారు. 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ విభాగాలు అప్రమత్తమయ్యాయి. సహాయక బృందాలను రంగంలోకి దింపాయి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి.
బోయిన్‌చెరువు తెగడం, హస్మత్‌పేట నాలా పొంగిపొర్లడంతో దాదాపు 100 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉప్పల్‌, కుషాయిగూడ, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, కొత్తపేట, బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, విూర్‌పేట, పాతబస్తీలోని పలు కాలనీలు నీటచిక్కి గజగజ వణికాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోయాయి.

వరదనీరు గురువారం మధ్యాహ్నానికి కూడా తగ్గలేదు. టోలిచౌకి నదీం కానీ, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్‌నుమా, కవాడిగూడ అరవింద్‌ కాలనీ, రామంతా పూర్‌ తదితర ప్రాంతాల్లో ప్రజను బోట్ల ద్వారా ఇతర ప్రాంతాకు తరలించారు. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మూసారాంబాగ్‌ బ్రిడ్జి ఫెన్సింగ్‌ రెండువైపులా కొట్టుకు పోయింది. ఇక్కడ రోడ్డు మొత్తం కొట్టుకు పోయి, రాళ్లు తేలాయి. హుస్సేన్‌సాగర్‌ నీరు పూర్తిస్థాయి మట్టాని కంటే ఎక్కువై తూము గుండా దిగువకు ప్రవహిస్తోంది. రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన నీటిని తొగించేందుకు డివైడర్లు ధ్వంసం చేశారు. ఆరు జోన్లలోని 30 సర్కిళ్లలో పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏకంగా 24 మంది మరణించారు. హైదరాబాద్‌ జిల్లాలో 11 మంది మరణించారు. రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ముగ్గురు, మేడ్చల్‌ జిల్లాలో ఇద్దరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *