Telangana Plans Hike in Electricity Charges విద్యుత్‌ ఛార్జీలు

ఆంధ్ర లాగే తెలంగాణ లో కూడా పెరగనున్న విద్యుత్‌ ఛార్జీలు

లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఇంటికే పరిమితమైన కొందరికి అప్పుడే విద్యుత్‌ ఛార్జీలు వాయించడంతో ఆందోళన చెందుతున్నారు. పులివిూద పుట్రలా ఇప్పుడు కరెంట్ బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. కేంద్రం ఓ వైపు విద్యుత్‌ బిల్లు ను తీసుకుని రాబోతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ ఛార్జీలు బుసకొడుతున్నాయి. ఎపిలో కరెంట్‌ ఛార్జీలు పెంచితే… తెలంగాణలో పెంచబోతున్నారు. దీనికితోడు  తెంగాణలో గతేడాది కరెంట్ బిల్లుల ఆధారంగా ఒక్కో ఇంటికి ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లులు పంపడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు కొందరు తాము ఇళ్లు, కార్యాలయాలను మూసేసుకున్నా వేలల్లో బిల్లులు వచ్చాయని వాపోతున్నారు. ఉచిత విద్యుత్‌ పొందుతున్న రైతులకు కూడా కేంద్ర విద్యుత్‌ బిల్లు తో పిడుగు పడనుంది. ప్రజలను ఆదుకుంటామని ఓ వైపు ప్రకటనాలు గుప్పిస్తున్న తెలుగు ప్రభుత్వాలు ప్రజకు కరెంట్‌ షాక్‌ ఇవ్వడం చూస్తుంటే వారి ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

Read More From PrajaJyothi News : వాటరింగ్ డే కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి

Telangana Plans Hike in Electricity Charges విద్యుత్‌ ఛార్జీలు
Telangana Plans Hike in Electricity Charges విద్యుత్‌ ఛార్జీలు

Read More From PrajaJyothi News : బాలీవుడ్‌ నటి ఊర్వశి రూటేలా మనసు కూడా అందమే!

ఇష్టారీతిన విద్యుత్‌ బిల్లులు పెంచుతున్న ప్రభుత్వాలు

దీనికితోడు కేంద్రం విద్యుత్  రంగాన్ని కబళించాని చూస్తోంది. దీంతో రాష్ట్రాలకు పిడుగుపాటు కానుంది. ఉచిత విద్యుత్‌ పొందుతున్న రైతుకు కూడా అశనిపాతం కానుంది. కేంద్రం తన పరిధిలోకి ఈ రంగాన్ని తీసుకున్నాక విద్యుత్‌ ఛార్జీలు పరిస్తితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ఈ లోగానే విద్యుత్‌ ఛార్జీలు  పెంచడం, ఇష్టారీతిన బిల్లు లు పెట్టడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలు  ఆలోచించాలి. వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందుతుందున్నా, ఇష్టారీతిన బిల్లు లు రావడంతో ప్రజలు జీర్ణించుకోవడం లేదు. తెలంగాణలో గత ఐదారేళ్లుగా నిరంతర విద్యుత్‌ అందడంతో ప్రజలు బిల్లు లను  పెద్దగా లెక్కించడం లేదు. మరోవైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచుతామని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత బిల్లు మొత్తాన్ని చూస్తుంటే ఇకముందు బిల్లు షాక్‌ ఇవ్వక తప్పకపోవచ్చు. అలాగే ఎపిలోనూ విద్యుత్‌ ఛార్జీ పెంపు నిర్ణయంపై ప్రజలు  ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతి యూనిట్‌కు 7 రూపాయల ఖర్చు అవసరం అవుతోంది. ప్రతి యూనిట్‌కు అయిన ఖర్చును ప్రతి వినియోగదారుడి నుంచి రాబట్టాలనుకుంటే అల్పాదాయ వర్గాలు ఇబ్బంది పడే అవకాశముంది. అందుకే ఈ వర్గాల నుంచి తక్కువ ఛార్జీని నిర్ణయించి వసూలు చేస్తున్నారు.

Read More From PrajaJyothi News : ప్రాచీన వేద సంస్కృతి లో ఎంగిలి దోషం

30 శాతం విద్యుత్ వ్యవసాయ రంగానికే ఖర్చు అవుతుంది

ప్రస్తుతం గృహ రంగంలో నెలకు 50 యూనిట్లు విద్యుత్‌ వాడుకుంటున్న వినియోగదారులకు నిర్ణయించిన యూనిట్‌ ఛార్జీ కేవలం రూ.1.45 పైసలు. అంటే యూనిట్‌కు సుమారు రూ.5.50 పైసల ఆదాయం ఈ వర్గాల నుంచి తగ్గుతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, పరిశ్రమకు ఎక్కువ విద్యుత్‌ ఛార్జీలు నిర్ణయించిన కారణంగా వచ్చే ఆదాయం రూపంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు పొందుతున్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి కూడా 24 గంట ఉచిత విద్యుత్‌ అమవుతోంది. వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు లేవు. రైతు ఎంత విద్యుత్‌ వాడుకునే విషయం తెలియాంటే వీటికి విూటర్లు బిగించాల్సిందే. మొత్తం విద్యుత్‌ వినియోగంలో 30 శాతం మేర వ్యవసాయ రంగమే ఉంటోంది.  కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం ఈ పద్ధతికి స్వస్తి చెప్పాల్సిందే. ఒక యూనిట్‌ సరఫరాకు అయిన ఖర్చును పరిగణనలోకి తీసుకొని ఈఆర్‌సీ నిర్ణయించిన విద్యుత్‌ ఛార్జీలు ప్రతి వినియోగదారుడూ ముందు చెల్లించాలి.

ప్రభుత్వం కావాలనుకుంటే రాయితీని వినియోగదారుడికి తరువాత అందించాల్సి ఉంటుంది. అంటే గ్యాస్‌ సబ్సిడీ లాగా విద్యుత్‌ ఛార్జీలు‌ సబ్సిడీని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.  నిత్యం వాడుకునే విద్యుత్‌కు ప్రతి నెలా వందల్లో విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఎంత విద్యుత్‌ వాడుకున్న వారికి రాయితీ ఇవ్వాలి?  సొమ్ము రూపంలో ఇవ్వాలా? లేక ప్రతి నెలా కొన్ని యూనిట్లను పరిగణనలోకి తీసుకొని రాయితీ ఇవ్వాలా? ఇళ్లు అద్దెకు ఇచ్చే వారికి మూడు నాలుగు విద్యుత్‌ కనెక్షన్లు ఉంటాయి. అపుడు వారికి కూడా ఇవ్వాలా? అన్న సమస్యలు  వస్తాయి.

Read More From PrajaJyothi News : మత్సకారుల కుటుంబాలు ఆర్థికంగా బలపడాలి

రైతులకి గొడ్డలి పెట్టుగా మారనున్న కరెంట్ బిల్లు

నిజానికి ఎన్ని సంస్కరణలు  తెచ్చినా విద్యుత్‌ రంగం సంక్షోభం నుంచి బయటపడడంలేదు. ఇలాంటి స్థితి నుంచి బయట పడేయడానికి కేంద్రం ఎప్పటికప్పుడు సంస్కరణ పేరిట మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రా అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నిస్తోంది. బలవంతంగా నిబంధనలను రుద్దే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తీసుకుని రాబోయే చట్టం ప్రకారం రైతులే విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉచితంగా ఇవ్వాల్సి వస్తే రైతు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. విద్యుత్‌ రంగం ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే తప్ప ఈ రంగం మనుగడ సాధ్యం కాదు. అయితే కేంద్రం తీసుకుని రాబోతున్న విద్యుత్‌ బిల్లు వలన సమాజంలోని అల్పాదాయ వర్గాలు ముఖ్యంగా రైతుకు గొడ్డలిపెట్టు కానుంది. పంపుసెట్ల విూద ఆధారపడే రైతు వ్యవసాయం చేయడం కూడా కష్టం కానుంది. ఆయా వర్గాలకు  కొత్తగా వచ్చే భారం మోయడం కష్టమే.  లాక్‌డౌన్‌ వేళ ఆదాయం లేకుండా ఇంటికే పరిమితం అయిన ప్రజలపై భారం మోపడం సరికాదు. తెలంగాణలో వచ్చిన బిల్లులను సవిూక్షించాల్సి ఉంది. లేకుంటే ప్రజలపై తీవ్ర భారం కానుంది.  

Read More From PrajaJyothi News : PrajaJyothi News Today Paper PDF

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *