Telangana IT Minister KTR Advice to Central Government to be Support IT Pharma Companies తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌

ఐటి, ఫార్మా, రియల్‌ రంగాలకు  ప్రభుత్వాలు అండగా నిలవాలి : తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌, (ప్రజాజ్యొతి న్యూస్) :  భారతీయ ఆర్థిక వ్యవస్థలో గ్రావిూణ ఆర్థికరంగం వాటానే ఎక్కువ. దేశానికి కొత్త జవసత్వానిచ్చేందుకు ఇదే మంచి సమయం. రూపాయి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలపై కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి. ఇదే విషయాన్నీ తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ కేంద్రానికి సూచించారు. దీంతో వివిధ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అండగా నిలిస్తే ఉత్పత్తి, సేవా రంగాలు  ఆరునెలల్లో గాడినపడతాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటి వరకు ఐటీ రంగం ఇప్పటికే నష్టపోగా, మరో రెండు నెలలు దానిపై కరోనా సంక్షోభ ప్రభావం ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టుఉ రాకపోతే తీవ్ర నష్టాలను చవి చూడాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు అని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ చెప్పారు . ప్రపంచ దేశ అతి త్వరగా కోలుకునే కాలాన్ని బట్టి దీనిపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం వాటా 17 శాతం కాగా ఇందులో ఐటీరంగం వాటా కొద్ది మాత్రమే. కాబట్టి ఐటీ రంగంలో ఉద్యోగా కోత, పింక్‌ స్లిప్‌ జారీ వంటివి పెద్దగా ప్రభావం చూపవని అంచనా వేస్తున్నారు.  ఈ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం సంస్కృతి ఇకముందు కొనసాగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Read More From PrajaJyothi News : తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ ఛార్జీలు షాక్ ఇస్తున్నాయి

Telangana IT Minister KTR Advice to Central Government to be Support IT Pharma Companies తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌
Telangana IT Minister KTR Advice to Central Government to be Support IT Pharma Companies తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌

Read More From PrajaJyothi News : వాటరింగ్ డే కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్ లో అఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరగనుంది : తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్

కాగా డేటా సెక్యూరిటీ, పనిలో నాణ్యత వంటివి దృష్టిలో పెట్టుకుని ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఒక్క ఉద్యోగికి వంద చదరపు అడుగు విస్తీర్ణం చొప్పున ఆఫీస్‌ స్పేస్‌ ఉండగా, భౌతికదూరం నిబంధన నేపథ్యంలో 150 చదరపు అడుగులకు విస్తరించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నగరంలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. మరోవైపు అమెరికా, యూరోప్‌లోని చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీల ప్రస్తుత సంక్షోభం తర్వాత ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు  నిర్వహించవచ్చని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ అంటున్నారు. ఆతిథ్య రంగంలోనూ భౌతికదూరం నిబంధనతో నిర్మాణరంగానికి డిమాండ్‌ పెరగొచ్చంటున్నారు. కరోనా సంక్షోభానికి ఆర్న్లెల్ల  ముందే ఆర్థిక పరిస్థితి ప్రపంచంతో పాటు భారత్‌లో కూడా మందగమనంతో సాగుతూ వచ్చింది. దీంతో మనం కరోనాకు ముందు, ఆ తర్వాతి పరిస్థితును శాస్త్రీయంగా సవిూక్షించుకోవాలి అని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ చెప్పారు. 2022 లేదా 2023 నాటికి ఉండే పరిస్థితును అంచనా వేసుకుని ముందుకెళ్లాలి. గతంలో కరువు నుంచి వ్యవసాయ రంగం గట్టేక్కినట్టే ప్రస్తుత సంక్షోభం నుంచి ఉత్పత్తి, సేవా రంగాలు తిరిగి పుంజుకోవడానికి ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి.

Read More From PrajaJyothi News : బాలీవుడ్‌ నటి ఊర్వశి రూటేలా మనసు కూడా అందమే!

పెద్ద పరిశ్రమలకి G.S.T నిబంధన సడలింపు చేయాలి

గతంలో వరుసగా రెండు, మూడేళ్ల పాటు కరువొచ్చినా ఈ రంగం తిరిగి పుంజుకుంది. ఈ ఏడాది తెలంగాణ, ఏపీ లో వ్యవసాయరంగం పురోగతి సాధిస్తోంది. ప్రభుత్వం ఈ రంగానికి అండగా నిలిస్తే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది. ఇదే తరహాలో ఉత్పత్తి, సేవా రంగాలు పుంజుకుంటాయి అని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.  పెద్ద పరిశ్రమ మనుగడకు జీఎస్‌టీ నిబంధన సడలింపు, రుణాల వసూల్లపై మారటోరియం వంటివి అమలుచేయాలి. సెవిూ అర్బన్‌, అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం సులభతర వాణిజ్య విధానాలు అమయ్యేలా చూడాలి. హెలికాప్టర్‌ మనీ ఆలోచన మంచిదే కానీ సరైన పర్యవేక్షణ లేకుంటే వియత్నాం తరహా ప్రతికూల ఫలితాలు వస్తాయి. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం విషయానికొస్తే.. నిర్మాణ, ఇతర రంగాల్లో పనిచేసేందుకు తెలంగాణా గ్రావిూణ ప్రాంతాలు, ఇతర రాష్టాల నుంచి వలస వచ్చే కార్మికుల సంఖ్య వచ్చే పదేళ్లలో పదింతలు  కావచ్చు అని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్ అబిప్రాయపడ్డారు. ఐటీ, ఫార్మా, మౌలిక వసతులు, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో హైదరాబాద్‌ సాధిస్తున్న పురోగతే దీనికి కారణం. బ్యాంకు కూడా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా ఆదుకునేందుకు ముందుకు రావాలి. 

Read More From PrajaJyothi News : PrajaJyothi News E-Paper PDF

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *