ఆచార్య సెట్లో సోనూసూద్ ను సన్మానించిన తనికెళ్ల భరణి

హైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మందికి సోనూసూద్ టిక్కెట్లు అందించి దగ్గరుండి వారి స్వస్థలాలకు చేరవేశాడు. రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వేలాదిమంది కోసం బస్సులు , ఇతర వాహనాలు ఏర్పాటు చేసి సురక్షితంగా ఇండ్లకు చేర్చాడు. ఆ తర్వాత కూడా సమస్యతో సంప్రదించిన వారికి కూడా అండగా నిలిచి అవసరాలను తీర్చి రియల్ హీరో అనిపించాడు. సోనూసూద్ గొప్ప మనసుకు దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. సోనూసూద్ మానవ సేవను కొనియాడుతూ ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్లభరణి ఆయనకు సత్కారం చేశారు. సోనూసూద్కు ఆచార్య మూవీ సెట్స్ లో శాలువా కప్పి సన్మానించారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివకు కూడా సన్మానం చేశారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్నఅల్లుడు సెట్స్ లో చిత్రయూనిట్ సోనూసూద్ ను సన్మానించిన విషయం తెలిసిందే.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *