తమిళ నటి చిత్ర అనుమానాస్పద మృతి..!!

చెన్నై : సెలబ్రిటీలు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. చెన్నై తమిళ టీవీ రంగంలో ఎంతో పాపులారిటీ ఉన్న నటి వీజే చిత్ర బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె వయసు 28 సంవత్సరాలు . వీజే చిత్ర (28) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చెన్నైలోని ఓ హోటల్‌లో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. కొద్దిరోజులక్రితం వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే హేమంత్‌తో కలిసి ఉన్న హోటల్‌ గదిలోనే ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించింది. బుధవారం ఉదయం స్నానం చేసి వస్తానని వెళ్లిన చిత్ర.. ఎంతకీ తలుపు తీయకపోవడంతో హేమంత్‌ హోటల్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో హోటల్‌ సిబ్బంది డూప్లికేట్‌ కీతో గది తలుపు తెరిచారు. గదిలో చిత్ర చీరతో ఉరి వేసుకుని కన్పించింది. చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ పరిశ్రమ దిగ్బ్రాంతి ని వ్యక్తం చేస్తోంది. పాపులర్‌ టీవీ షో ’పాండ్యన్‌ స్టోర్స్‌’తో ఆమె మంచి నటిగా గర్తింపు తెచ్చుకున్నారు. వీజే చిత్ర మృతి కారణాలు వెంటనే వెల్లడికాలేదు . పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *