ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : ఎంపీ సోయం

ఆదిలాబాద్ : ఆదివాసుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని… రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జీవో నెంబర్ 3 సుప్రీం కోర్టు లో కొట్టి వేయడం జరిగిందని.. ఆదివాసి యువకులకు ఏజెన్సీలో 100% ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పోరాటానికి సిద్ధమేనని ఎంపీ సోయం బాపురావు గారు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలయినా మత్తడి గూడా .. సుద్ది గూడ.. కొత్తగూడ.. గిరిజన గ్రామాల్లో ఎంపీ సోయం బాపురావు పర్యటించారు.. ఆదివాసీ గిరిజనులు మారుమూల గ్రామాల్లో ఎంపీ గారికి ఘన స్వాగతం పలికారు.. సుద్దు గూడలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు 860 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం జరిగిందని.. కేంద్ర మంత్రి తోమర్ ను కలిసి విన్నవించగా సానుకూలంగా స్పందించారని త్వరలోనే రోడ్డు మంజూరు అవుతాయని ఎంపీ సోయం బాపురావు వివరించారు. సుద్దు గూడా లో బిటి రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్. పేరిట ప్రజలపై కోట్ల భారం వేస్తోందని.. ఆదివాసీ ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ విరమించుకోవాలి అన్నారు.. పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ పట్టించుకోలేదని పక్కనే గల ఆంధ్ర సీఎం జగన్ పోడు భూములకు పట్టాలు ఇస్తున్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు.. ఆదివాసీ గిరిజనుల పట్ల సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. సుప్రీంకోర్టులో లో జీవో నెంబర్ 3 కొట్టి వేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చ ముందుకు రాకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదివాసి షెడ్యూల్ ప్రాంత గిరిజనులకు న్యాయం కలిగేలా జీవో నెంబర్ 3 పై పోరాడుతామని స్పష్టం చేశారు. రాజ్యాంగం చట్టాల పట్ల అవగాహన లేదని కొందరు నాయకులు బీజేపీ ప్రభుత్వం పై విమర్శిస్తున్నారని తెలియకపోతే అవగాహన చేసుకోవాలని ఎంపీ కోరారు. 1986లో ఐదవ షెడ్యూల్ కింద ఏజెన్సీలోని గిరిజన నిరుద్యోగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేక చొరవ చూపి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించారని.. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయకపోవడం వల్ల ఆదివాసుల కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందన్నారు.

ఆదివాసీ గిరిజన బిడ్డలకోసం నిరుద్యోగుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ బిల్లు తీసుకు వచ్చారని.. పత్తికి మద్దతు ధర కల్పించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదివాసీ పోడు భూములకు డిసెంబర్ 9వ తేదీలోగా పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఖానాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ సట్ల అశోక్, జిల్లా గిరిజన మొర్చ అధ్యక్షుడు మరప రాజు, బీజేపీ మహిళ కార్యదర్శి భాగ్యలక్ష్మి , రాజమణి, గిరిజన నాయకులు ఆత్రం తిరుపతి, సిడం గంగాధర్, జిల్లా కార్యదర్శి కొందేర్రి రమేష్, పెందుర్ ప్రభాకర్, పుర్క బాపు రావు రాంచందర్, తిరుపతి మరియు. పార్టీ నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *