బాల్యాన్ని మింగేస్తున్న స్మార్ట్ ఫోన్‌ లు

హైదరాబాద్‌ : ఆటపాటలు లేకుండా పుస్తకాలతోనే కుస్తీ పడుతూ అనేకమంది చిన్నారులు ఒంటరిగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒకప్పుడు అనురాగాలు , అప్యాయతతో గడిచిన బాల్యం నేడు మారుతున్న సాంకేతికతతో అన్నిరకాల అప్యాయతలను కోల్పోతోంది. కరోనా కారణంగా ఆరేడు నెలలుగా ఇంటికే పరిమితమైన చిన్నారులు టీమీ, స్మార్ట్‌ఫోన్‌ లు, ట్యాబ్‌ లు, వీడియో గేమ్స్‌ వంటివాటితో గడపాల్సి వచ్చింది. మరోవైపు ఆన్‌లైన్‌ తరగతు కారణంగా పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు , టీమీ అనివార్యంగా దగ్గరయ్యాయి. ఇరవై ఏళ్ల క్రితం వరకు చిన్నారులకు అన్నం తినిపించాంటే వారి తల్లులు చందమామను చూపెట్టో, పాట పాడో, కథులు చెబుతో తినిపించేవారు. కానీ నేటితరం పిల్లలు స్మార్ట్‌ఫోన్‌, టీవి లేనిది ముద్ద తినడం లేదు. మారుతున్న సాంకేతికత, పరిజ్ఞానం రోజురోజుకూ చిన్నారులను వారి తల్లిదండ్రులకు దూరం చేస్తోంది. ఉద్యోగాలు , వ్యాపారాలు ఇతర బాధ్యతతో తల్లిదండ్రులు బిజీగా ఉంటూ చిన్నారి పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్న సంస్కృతి నేటి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతుంది.

ఆధునిక టెక్నలజీతో అనర్థాలు
బాల్యం ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందమైన జ్ఞాపకం. కానీ నేటి తరం చిన్నారులు మాత్రం ఆ ఆనంద క్షణాలకు దూరమవుతూ వారికే తెలియని ఒంటరి జీవితాలను గడుపుతున్నారు. ఉదయం లేవగానే పాఠశాలకు వెళ్లడం సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్‌లు ఇవి సాధారణంగా పెద్దపిల్లలకు ఉండే రోజు వారి దినచర్యు. కానీ కరోనా సంక్షోభంతో ఉదయంనుంచి సాయంత్రం వరకు ఇప్పుడు వారికి అవే కాలక్షేపంగా మారాయి. దీనికి విరుగుడు ఆలోచించాలి. పెద్దలు పిల్లలకు కథ రూపంలో విద్యను అందించాలి. తల్లిదండ్రు తమవంతు బాధ్యతగా వారికి చదువు చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రు ఇద్దరు ఉద్యోగస్థులైతే ఆ చిన్నరులు సైతం ట్యూషన్‌కు వెళ్లాల్సిందే. ఇలా పగలంతా చదువుతో కుస్తీ పడుతూ సాయంత్రం ట్యూషన్‌లకు ఇంటికి రాగానే టీవో, సెల్‌ఫోన్‌తో ఆటలు ఇలా చిన్నారుల జీవితాలు అనురాగాలు , అప్యాయతలకు దూరమవుతున్నాయి.

మానసిక నిపుణుల ఆందోళన
ఒకప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళితే సాయం త్రానికి పిల్లల కోసం ఇంటికి వచ్చేవారు. నేడు ఎటు వెళ్లినా.. ఫోన్‌లో వీడియో కాలింగ్‌ ద్వారా మాట్లాడి దూరంగా ఉంటున్నారు. ఇలా ఒకరకంగా మారుతున్న టెక్నాలజీ వాళ్ళ కొంత ప్ర యోజనాలు ఉన్నా దాని వల్ల అనర్దాలే ఎక్కు వగా ఉంటున్నాయని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితిని నెలకొంది . కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ దశలో పిల్లలను ఒంటరిగా ఉండకుండా, అదేపనిగా ఫోన్లకు అలవాటు పడకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *