నాగశౌర్యకు జోడీగా శిర్లే సెటియా ?

హైదరాబాద్ : టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య సొంత సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అలా ఎలా ఫేం అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ సింగింగ్ సెన్సేషన్, యూట్యూబర్, నటి శిర్లే సెటియా తెలుగు ప్రేక్షకులను పుకరించేందుకు రెడీ అవుతున్నది. ఇంకా టైటిల్ కాని ఫిక్స్ కాని ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా శిర్లే సెటియా నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్, ఆక్లాండ్ నుంచి పాప్ ఆర్టిస్టుల్లో శిర్లే సెటియా ఒకరు.

ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా కనిపించింది. ఈ ఏడాది నికమ్మ చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా, శంకర్ ముపూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. మహతి స్వరసాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *