లవ్‌స్టోరీ తో వస్తున్న శేఖర్ కమ్ముల

హైదరాబాద్ : ప్లెజంట్‌ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా లవ్‌ స్టోరి. ఈ రియలిటిస్టిక్‌ ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి ప్లవి జంటగా నటిస్తున్నారు. ’లవ్‌ స్టోరి’ సినిమా తాజాగా పాట చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని దర్శకుడు శేఖర్‌ కమ్ముల , నాయిక సాయి పల్లవి , కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ సి కుమార్‌ సెలబ్రేట్‌ చేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. నిజామాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటతో లవ్‌ స్టోరి సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. థియేటర్లు తెరుచుకుని, హాల్స్‌ దగ్గర ఆడియెన్స్‌ సందడి మొదలు కాగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌ పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలు. చిత్రంలో రాజీవ్‌ కనకాల , ఈశ్వరీ రావు, దేవయాని ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *