Shankham

దారిద్ర్యం పోవాలంటే శంఖం మీ ఇంట్లో వుండాల్సిందే.. !!

హైదరాబాద్ (ప్రజాజ్యోతి న్యూస్) : భారతీయ సంస్కృతి లో ’శంఖం’కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. ఇది రెండు సంస్కృత పదాల కలయిక. శంఖం అంటే మంచి అని, జలం అనే అర్థం లు వస్తాయి. పురాణాల ప్రకారం క్షీరసాగర మధనం లో సముద్రం నుండి దేవతలకు వచ్చిన 14 రత్నాలలో ఇది ఒకటి గా చెబుతారు. లక్ష్మీదేవికి శంఖము సహోదరుడని విష్ణుపురాణం చెబుతోంది. ఇది ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు మహాభారతం యుద్ధ సమయంలో పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అదేవిధంగా అర్జునుడి శంఖాన్ని దేవదత్తంగానూ, భీముని శంఖము పౌండ్రకం అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని అనంత విజయమనీ, నకులుని శంఖాన్ని సుఘోష నామంతో, సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అన్న పేర్లతో పిలుస్తారని, వీరు యుద్ద సమయంలో వీటిని పూరించినట్లు మహాభారత కథ చెబుతుంది. వైరివర్గంతో యుద్దానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.

Read More From PrajaJyothi News : అన్నదానం (Annadaanam) తో రాజయోగం..!!

Shankh Importance శంఖం

శంఖము ధ్వని తో విజయం వరిస్తుంది..!!

లక్ష్మీ మరియు శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖము యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితం విూద, గంగా సరస్వతులు
ముందు భాగంలో ఉంటారు. విష్ణుమూర్తి దుష్ట శక్తులను పారద్రోడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలో శంఖం ఒకటిగా మారింది. శంఖమును జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజారాధన, యజ్ఞం తాంత్రిక క్రియలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖము ధ్వని తో విజయం, సమృద్ధి, సుఖం, కీర్తి ప్రతిష్టలు, లక్ష్మీ ఆగమనం లభిస్తుంది. ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి, అభిషేకం చేస్తారు. శంఖాలలో ఆకారాన్ని బట్టి దక్షిణావర్త, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలో నూక్ష్మీ, గోముఖ, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షసం, శని, రాహు, కేతు, కూర్మ శంఖం అనే రకాలు ఉన్నాయి.

Read More From PrajaJyothi News : ఆ పౌడర్ ను కొబ్బరిబొండం లో కలిపి తాగితే కిడ్ని సమస్యలు రావు!

దక్షిణావర్త శంఖం మీ ఇంట్లో వుంటే మీరు ఐశ్వర్యవంతులే…!!

ఇల్లు సిరి సంపదలతో తులతుగాలంటే పూజా మందిరంలో కుడివైపు నుంచి తెరచుకుని ఉండే దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఇది ఉన్న చోట శ్రీమహాక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్ర్యం వదిలిపోతుంది. అదేవిధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వలన వ్యాధి బాధలు కూడా నశిస్తాయి. శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలిగి, గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెంది, ఊపిరితిత్తు పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. దీన్ని ఊదడం వలన గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వలన మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వలన గాని, ఆ ధ్వనిని వినడం వలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.

Read More From PrajaJyothi News : Read Today PrajaJyothi Epaper

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *