అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీల పట్టివేత

జనగామ (స్టేషన్ ఘణపూర్) : ఫేక్ వే బిల్లు ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 15 లారీలను గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇంచార్జ్ ఏసీపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ములుగు వైపు నుండి ఫేక్ వే బిల్లుతో అక్రమ ఇసుక రవాణ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం ప్రకారం   వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ప్రతాప్, స్టేషన్ ఘణపూర్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు ఎస్ ఐ లు రమేష్ నాయక్, మోహన్ బాబు, చిల్పూర్ ఎస్ ఐ మహేందర్ మరియు పోలీసు బృందంతో డివిజన్ కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు.

అదుపులో 15 లారీలు, ఓనర్లు, డ్రైవర్ లు

అదుపులో 15 లారీలు, ఓనర్లు, డ్రైవర్ లు

ఈ నేపథ్యంలో నకిలీ  వే బిల్లు పత్రాలతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 15 లారీలను పట్టుకోవడం జరిగిందన్నారు. లారీలు నడుపుతున్న డ్రైవర్లను విచారించగా మణుగూరు వద్ద గల ఏడూళ్ల బయ్యారం వద్దనుండి ఇసుక తీసుకు వస్తున్నట్లు వారు చెప్పడం జరిగిందన్నారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా సమాచారం తీసుకుని ఫేక్ వే బిల్లుగా నిర్ధారించి 15 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ లారీలను సంబంధించిన 10 మంది ఓనర్లను, డ్రైవర్లను అరెస్టు చేయడం జరిగిందని, లారీలను  జప్తు చేసి అందులో ఉన్నటువంటి ఇసుకను మైనింగ్ శాఖ వారికి అప్పగించి, రవాణ చేసిన వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటివి మల్లి పునారావృతం కాకుండా మరింత పకడ్బందీగా తనిఖీలు చేపడుతామని ఇంచార్జ్ ఏసీపీ వినోద్ కుమార్ తెలియజేశారు. 

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *