మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికపై అసమ్మతి సెగ

మాడుగుల (రంగారెడ్డి) (ప్రజాజ్యోతి) : పదవులు ఉన్న వారికే పదవులా ? మండల పార్టీ పదవులు లేని వారికి పదవులు ఇవ్వరా .. ? వేరే వారికి ఇస్తే బాగుండేది అని, మండల పార్టీ అధ్యక్షులు ఎన్నికపై కార్యకర్తల్లో అసమ్మతి సెగలు అలుముకున్నవి. రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ నుంచి గాంధీభవన్ లో మండల పార్టీ అధ్యక్షుని నియామక పత్రం ఇవ్వడం తో అసమ్మతి ఏర్పడ్డది. అందరికీ ఆమోదయోగ్యం అయిన వ్యక్తి పేరును అడిగి తెలుసుకోకుండా, నియంత పరిపాలన ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయం కొనసాగుతుందని ప్రజలు అంటున్నారు. 40 సంవత్సరాల నుండి ఓకే ఊరు, ఓకే ఇంటి నుండి పార్టీ పదవులు, ప్రజా పదవులు, రాజకీయ నియంత గా ఇన్ని ఏళ్ళుగా రాజ్యమేలుతుందని మాడుగుల మండల ప్రజలు పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు గ్రూపులు గా ఉండి పంచాయతీ ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత ఏదో విధంగా రాష్ట్ర నాయకులు కనుక్కొని అందరూ కలిసిమెలిసి ఉండి మండల ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోరాడి ఐక్యంగా ఉండి మండల అధ్యక్ష పదవిని జెడ్పిటిసి గెలిపించుకున్నారు.

ఎన్నో సంవత్సరాల నుండి పార్టీలో పదవులు లేకుండా ఉన్న బిసి నాయకులు ఎందరో ఉన్నారు. అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ నాయకులకు ఏనాడు పదవులు ఇచ్చిన పాపాన పోలేదు. గత 20 సంవత్సరాలలో ఉన్న వర్గాలు విడిపోయి ? అందరూ కలిసి మెలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు ఎంతో సంతోషపడినా అది మున్నా ల్ల ముచ్చటగానే మారిందని వాపోతున్నారు. ఇలాగే కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి, వెల్దండ మండలాల్లో ఒకే తాటిపై ఉన్న వర్గాలను ముక్కలుగా చేసినారు అని ప్రజలు పెర్కొంటున్నారు. కావున మళ్ళీ వర్గాలుగా ఏర్పడకుండా అందరు కలిసి మెలిసి పార్టీ అభివృద్దికి తోడ్పడాలని అక్కడి కాంగ్రెస్ వర్గాలు తెలియచేస్తున్నాయి.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *