సింగరేణి సంస్థ లో మహిళ ఉద్యోగుల కు భద్రత కరువు......

మంచిర్యాల (క్యాతన్ పల్లి) :135 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన బొగ్గు ఉత్పత్తి రంగం లో శర వేగంగా దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ లో సైతం మహిళ ఉద్యోగులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. సింగరేణి అధికారిణి స్థాయి నుండి చపరాసి వరకు, మహిళ కాంట్రాక్టు ఉద్యోగులు ఎదో ఒక చోట లైంగిక వేధింపులను తోటి పురుష ఉద్యోగుల నుండి ఎదుర్కొంటున్నారు.

మందమర్రి ఏరియా లోని రామకృష్ణా పూర్ ఏరియా ఆసుపత్రిలో కొనసాగుతున్న కీచక పర్వం ఆలస్యంగా బయట పడింది. గత రెండు రోజులుగా పట్టణంలో వార్తలు గుప్పుమన్నాయి.స్థానిక ఏరియా ఆసుపత్రి లో వార్డ్ బాయ్ లు గా విధులు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులు,తమ తో పాటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ సోకిన ఎస్క్యూటివ్ అధికారుల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గది ని సదరు వార్డ్ బాయలు మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకున్నరని అనే అనుమానం తో ఏరియా ఉన్నత స్థాయి అధికారులు శుక్రవారం ఆసుపత్రి ని సందర్శించి విచారణ చేపట్టి, ప్రత్యేక గదిని సీజ్ చేసినట్లు సమాచారం.అధికారుల విచారణ లో ఉద్యోగులు తప్పు చేసినట్లు రుజువు అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

వార్డ్ బాయ్ ల దాష్టీకం…..
ఏరియా ఆసుపత్రి లో జరుగుతున్న వార్డ్ బాయ్ ల దాష్టీకమ్ గురించి ఉన్నతాధికారుల కు తెలిసినప్పటికీ వార్డ్ బాయ్ లను కాపాడేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది చర్చించుకుంటున్నారు.ఏరియా స్థాయి అధికారుల వద్ద కు విషయం చేరడం తో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఏరియా స్థాయి ఇతర డిపార్ట్ మెంట్ ల అధికారులు సైతం ఎదురు చూస్తున్నారు.

తీరుమారని వారే వీరు…..
ఏరియా ఆసుపత్రిలో సుమారు 10 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ వార్డ్ బాయ్ లు గత కొన్ని ఏండ్లు గా ఒకే చోట విధులు నిర్వహిస్తుండడం తో ఆసుపత్రి ఉన్నత అధికారులు సైతం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని ఆసుపత్రి వర్గాలు అనుకుంటున్నయి. తోటి మహిళ సిబ్బంది పట్ల ప్రత్యక్షంగా,పరోక్షంగా లైంగికంగా వేధింపుల కు గురి చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని మహిళ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *