17 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్‌ రీఎంట్రీ

హైదరాబాద్ : రేణు దేశాయ్‌ తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాచారం. బద్రి సినిమాతో కథానాయికగా టాలీవుడ్‌ కి పరిచయమయ్యారు రేణు దేశాయ్‌. ఆరంగేట్రమే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరసన నటించిన ఈ భామ ఆ తర్వాత జానీ చిత్రంలోనూ పవన్‌ సరసన నటించారు. 2010 లో పవన్‌ కళ్యాణ్‌ ని వివాహమాడాక నటనను విరమించుకున్నారు. ఇటీవ తనయుని నటుడిగా పరిచయం చేస్తూ ఇష్క్‌ వాలా అనే చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇటీవ రేణు దేశాయ్‌ బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తున్నారు. ఇక టాలీవుడ్‌ లో తన రీఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. దాదాపు 17 సంవత్సరా విరామం తరువాత.. రేణు దేశాయ్‌ తన రెండవ ఇన్నింగ్స్‌ కోసం సన్నద్ధమవుతున్నారు.

రేణు దేశాయ్‌ ఆధ్యా అనే చిత్రానికి సంతకం చేసారు. ‘ఆధ్యా’ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ. ఇందు రేణు దేశాయ్‌ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నందిని రాయ్‌ .. కబాలి ఫేమ్‌ సాయి ధన్సికతో పాటు బాలీవుడ్‌ నటుడు వైభవ్‌ తత్వావాడీ నటించారు. ఎస్‌ రజనీకాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హుషారు ఫేమ్‌ తేజ కూరపాటి.. గీతిక రతన్‌ యువ జంటగా నటించనున్నారు. ఆసక్తికరంగా రేణు కుమార్తె పేరు ఆద్యా. అదే పేరుతో రీఎంట్రీ సినిమాలో నటిస్తుండడం యాథృచ్ఛికమే. రేణు ఇటీవ బ్రీథ్‌ లెస్‌ అనే మ్యూజికల్‌ వీడియోలో కనిపించారు. 2013 లో వన్స్‌ మోర్‌ అనే చిత్రం తో నిర్మాతగా మారి.. 2014 లో ఇష్క్‌ వాలా వ్‌ తో దర్శకురాలిగా మారిన సంగతి తెలిసిందే. గ్యాప్‌ తర్వాత రేణు తిరిగి నటనలో అడుగుపెడుతున్నారు.

Share The News On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *